ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-11-28T05:15:37+05:30

పోలీసు వాహనాలు నడిపే డ్రైవర్లు విధి నిర్వహణ లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పోలీసు వాహన డ్రైవర్ల సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు


మహబూబ్‌నగర్‌, నవంబరు 27 : పోలీసు వాహనాలు నడిపే డ్రైవర్లు విధి నిర్వహణ లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. పోలీస్‌శాఖ అంటే ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నదని, ప్రతీ క్షణం జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్‌శాఖలో పనిచేసే డ్రైవర్లతో ఎస్పీ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమకు కేటాయించిన వాహనాలను ప్రాణంగా చూసుకోవాలని, డ్రై వింగ్‌ సీటును పవిత్రంగా భావించడం ప్రాథమిక సూత్రమని గ్రహించాలన్నారు. డ్రైవింగ్‌ చేయడానికి బలం అవసరం లేదని, ఒక వైద్యుడు సర్జరీని ఎంత ఏకాగ్రతతో చేస్తాడో డ్రైంవిగ్‌ చేసే వ్యక్తి కూడా అంతే ఏకాగ్రతతో సహనంగా మెలగాలని సూచించారు. ఏకా గ్రతతోనే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. వాహనాన్ని ఎప్పటికప్పుడు కండీషన్‌లో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కుమార్‌, పోలీస్‌ సంఘం అధ్యక్షుడు, పీఆర్‌ఓ, సీనియర్‌ మెకానిక్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising