ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ జనగణన చేపట్టాలి

ABN, First Publish Date - 2021-10-18T03:31:03+05:30

సమాజంలో 56శాతానికి పైగా ఉన్న బీసీ కులాల జనగణన చేపట్టాలని బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్య క్షుడు డాక్టర్‌ అజయ్‌కుమార్‌యాదవ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు.

కల్వకోల్‌ గ్రామంలో బీసీ జనచైతన్య వేదిక సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్‌ అజయ్‌కుమార్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అజయ్‌కుమార్‌ యాదవ్‌


పెద్దకొత్తపల్లి, అక్టోబరు 17: సమాజంలో 56శాతానికి పైగా ఉన్న బీసీ కులాల జనగణన చేపట్టాలని బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్య క్షుడు డాక్టర్‌ అజయ్‌కుమార్‌యాదవ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల పరిధిలోని కల్వకోల్‌ గ్రామంలో బీసీ జన చైత న్య వేదిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరై మాట్లాడుతూ  అణగారిన బీసీ కులాలను సంఘటితపరిచే విధంగానే బీసీ జన చైతన్య వేదిక అనే కార్యక్రమాలను చేపట్టిందన్నారు. బీసీలకు జనాభా దామా షా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 52శాతం రిజర్వేషన్‌ క ల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వె ల్లడైన బీసీ కులాల జనాభాను గుర్తించాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్ర మోషన్‌లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని, బీపీ మండల్‌ కమిషన్‌ సిఫారసులను యథావిధిగా అమలు చేయాలని బీసీ కులాలకు అట్రాసి టీ చట్టాన్ని వర్తింపజేయాలన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక రం గాల్లో వంద శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని విద్యా హక్కు చట్టం ప్రకారం 20 శాతం సీట్లను ప్రైవేట్‌, స్కూల్‌ కార్పొరేట్‌, కాలేజీల్లో ఉచితంగా పేద పిల్లలకు కేటా యించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సదస్సులో బీసీ జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శివార్చక విజయ్‌కుమార్‌, కోశాధికారి పించెల రవికుమార్‌, మాజీ జడ్పీటీసీ సింగారం వెంకటయ్య, సింగిల్‌ విండో ఉపాధ్యక్షుడు రాముయాదవ్‌, బీసీ జన చైతన్య వేదిక సంఘం నాయకులు బెట్టరి నాగరాజు, మనోహర్‌, శ్రీనివా సయాదవ్‌, బద్దుల ప్రవీణ్‌కుమార్‌యాదవ్‌, వీరయ్య, వెంకటస్వామి, నాగశేషి, కర్న యాదవ్‌, విజ్ఞయ్య, నల్లయ్య, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు శ్రీశైలం యాదవ్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T03:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising