ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ ఆస్పత్రిగా బాదేపల్లి సీహెచ్‌సీ

ABN, First Publish Date - 2021-05-10T04:58:31+05:30

బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 30పడకల కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చేం దుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు వెల్లడించారు.

కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేందుకు బాదేపల్లి కమ్యూనిటీ ఆసుపత్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దవాఖానాను పరిశీలించిన కలెక్టర్‌  వెంకట్రావు



జడ్చర్ల, మే 9 : బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 30పడకల కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చేం దుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు వెల్లడించారు. ఆదివారం బాదేపల్లి కమ్యూనిటీ ఆసుపత్రిని పరిశీలించిన అనంతరం ఆయన తహసీల్దార్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రిలో రెండు వార్డుల్లో 30పడ కలతో కొవిడ్‌ ఆసుపత్రిగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కొవిడ్‌ సోకిన వారికి ఆక్సిజన్‌తో చికి త్స అందించనున్నట్లు తెలిపారు. ఆక్సిజన్‌ ప్లాంటు ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడ్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, మండలం లోనిపెద్దపల్లి సమీపంలోని వర్చ్యూ(విర్కో) ఫార్మా పరిశ్రమ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడు తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 720 బృందా లతో మూడు మునిసిపాలి టీలు, 440 గ్రామ పం చాయతీలలో గడప, గడప ఫీవర్‌సర్వే చేపడుతు న్నారని కలెక్టర్‌ వెల్లడించారు. సర్వేలో కొవిడ్‌ లక్ష ణాలున్న వారికి అక్కడే మెడికల్‌ కిట్స్‌ అంది స్తున్నారని చెప్పారు. అవసరమున్న వారు మాత్ర మే కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించా రు. ఒకే ప్రాంతంలో 5కంటే అదనంగా పాజిటివ్‌ కేసులు ఉన్నప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్‌ జోన్‌ లుగా ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌తో సహ చి కిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని, అందు కు సంబంధించిన ప్రణాళికలను రూపొందించా లని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సోమ శేఖర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. చికిత్స అందించేం దుకు కావాల్సిన వైద్యులు, సిబ్బంది ఇతర వివ రాలతో పాటు పల్మనాజలిస్ట్‌ పోస్టుల కోసం ప్రతి పాదనలు పంపాలని సూచించారు. ఆసుపత్రిలో ప్రసూతి విభాగాన్ని వేరుగా, కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేం దుకు పార్టిషన్‌ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ముని సిపల్‌ కమిషనర్‌ సునీత, డీఎంఓ విజయ్‌ కుమార్‌, జడ్చర్ల అర్బన్‌హెల్త్‌సెంటర్‌ అధికారి డాక్టర్‌ శివకాంత్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-05-10T04:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising