ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్నేహపూర్వకంగా వ్యవహరించాలి

ABN, First Publish Date - 2021-06-24T05:04:33+05:30

ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌, హాజరైన ప్రొబేషనరీ ఎస్‌ఐలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌  

- ప్రొబేషనరీ ఎస్‌ఐలకు అవగాహనా సమావేశం

గద్వాలక్రైం, జూన్‌ 23 : ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ సూచించారు. ప్రొబేషనరీ ఎస్‌ఐలకు లా అండ్‌ ఆర్డర్‌ నిర్వహణపై జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అవగాహనా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు. పోలీసులు మిగతా ఉద్యోగుల్లా కాకుండా సమాజంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. పోలీసులకు సహనం ఎంతో అవసరమని, ప్రజలకు అత్యంత చేరువలో ఉండాలని అన్నారు. తాము చేసే ప్రతీ పని చట్టానికి లోబడి ఉండాలని అన్నారు. ప్రజలతో సేవాభావంతో వ్యవహరించాలని సూచిం చారు. ప్రస్తుత సమాజంలో అత్యాధునికంగా, సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు జరుగుతున్నాయని, నిందితులను పట్టుకునేందుకు పోలీస్‌ వ్యవస్ధ కూడా అంతకు మించి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. బాధితులతో మర్యాదపూర్వకంగా, స్నేహంగా, సానుభూతితో వ్యవహరించాలని సూచించారు.  కార్యక్రమంలో డీసీ ఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ సూర్యనాయక్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-06-24T05:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising