ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు దొంగల ఆరెస్ట్‌

ABN, First Publish Date - 2021-08-04T04:46:54+05:30

మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లోని సురేష్‌ బంగారు షాపులో 2017లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ రంజన్‌రతన్‌ కుమార్‌ తెలిపారు.

కేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    వడ్డేపల్లి, ఆగస్టు 3 : మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లోని సురేష్‌ బంగారు షాపులో 2017లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ రంజన్‌రతన్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్లో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరా లను వెల్లడించారు. సురేష్‌ బంగారు షాపులో వరుసగా రెండు సార్లు దొంగతనం జరగటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహించినట్లు తెలిపారు. చోరీకి పాల్పడిన అనంతపురం జిల్లాకు చెందిన రవీందర్‌ రెడ్డి, ఆంజనేయులు అనే ఇద్దరు వ్యక్తులను ఆరెస్ట్‌ చేసి, రూ.11.50 లక్షలు విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరూ హత్య కేసులలో కూడా నిందితులుగా ఉన్నారని చెప్పారు. గంగన్న అనే వ్యక్తి దొరకాల్సి ఉందని, అతడిని త్వరలో ఆరెస్ట్‌ చేసి కొంత సొమ్మును రికవరీ చేయాల్సి ఉందన్నారు. సొమ్మును రికవరీ చేసిన సీఐ, ఎస్‌ఐ, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ యాదగిరి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీహరి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T04:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising