ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ABN, First Publish Date - 2021-10-22T05:44:55+05:30

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీ క్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి వివరించారు.

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌ వెంకట్రావు, డీఈవో ఉషారాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రికి వివరించిన కలెక్టర్‌


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), అక్టోబరు 21 : జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీ క్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి వివరించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ విషయమై గురువారం విద్యాశాఖ మంత్రి జిల్లాల కలెక్టర్లు, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై భాగస్వామ్యం ఉన్న అన్నిశాఖల అధికారులతో ఈ నెల 11, 18 తేదీలలో రెండు సార్లు సమా వేశాలు నిర్వహించామని, మండల స్థాయిలోనూ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లతో, మునిసిపల్‌ కమిషనర్లతో సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్‌ చెప్పారు. పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారుల సమావేశాన్ని కూడా నిర్వహించామని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని, మాస్కు, శాని టేషన్‌ పక్కాగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించామని, విద్యుత్‌, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులందరు పరీ క్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 144 సెక్షన్‌ అమలులో ఉంటు న్నందున పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్‌ కేంద్రాలు మూసివేసేలా ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఇంటర్‌ విద్యాశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణ, ఆర్టీసీ డీఎం అశోక్‌ రాజ్‌, పోస్టల్‌ తదితర శాఖల అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సుకు హాజర య్యారు. కాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల కు 35 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 11,354 మంది విద్యార్థులు పరీక్షలు రాయ నున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.


ధాన్యం సేకరణపై సమీక్షించాలి


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), అక్టోబరు 21 : ధాన్యం సేకరణపై మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని తెలిపారు. గురువారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పంటల నమోదు, పరిశీలన, ఎరువులు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పంటల నమోదు, పరిశీలన కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. రైతు వేదికల్లో ప్రతీ మంగళ, శుక్రవారాలలో క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, రైతులు వరి పంటలను తగ్గించి ఇతర పంటలు పండించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, జిల్లా వ్యవసాయ అధికారిని సుచరిత, వ్యవసాయ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సుకు హాజరయ్యారు.

Updated Date - 2021-10-22T05:44:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising