కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN, First Publish Date - 2021-10-29T05:34:37+05:30
తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం గల కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు తెలిపారు.
చిన్నచింతకుంట, అక్టోబరు 28 : తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం గల కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు తెలిపారు. గురువారం మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి వేంకటేశ్వరస్వామి జాతర మైదానంలో వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్న స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈ బ్రహ్మోత్సవాలకు రాయచూరు, మహా రాష్ట్ర, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు జాతరకు, స్వామి వారి దర్శనం కోసం వస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జాతర మైదానంలో తాగునీటి వసతి, భక్తుల రద్దీని దృష్టిలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దుకాణాలను దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతర మైదానంలో మరిన్ని బాత్‌రూంలను ఏర్పాటు చేయాలని, మైదానాన్ని శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి ఆయన జాతర మైదానాన్ని పరిశీలించారు. భక్తులకు తగిన వసతులపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణా సుధా కర్‌రెడ్డి, ఎస్‌పీ ఆర్.వెంక టేశ్వర్లు, జడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీవో పీడీ యాద య్య, డీఎస్పీ కిషన్, సీఐ రజిత, ఎస్‌ఐ భాగ్యల క్ష్మీరెడ్డి, ఏసీ శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ హర్షవ ర్ధన్‌రెడ్డి, సర్పంచ్ సులోచన, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్ సువర్ణరాజు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T05:34:37+05:30 IST