ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికుల పరేషాన్‌

ABN, First Publish Date - 2021-05-07T04:41:49+05:30

పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గురువారం లాక్‌డౌన్‌ ప్రారంభం కావడంతో కర్నూల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

కర్నూల్‌ నుంచి ఆటోలో అలంపూర్‌ చౌరస్తాకు చేరుకుంటున్న ప్రయాణికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్తో రాష్ట్రానికి బస్సుల నిలిపివేత  

   గద్వాల, (ఆంధ్రజ్యోతి)/రాజోలి, మే 6 : పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గురువారం లాక్‌డౌన్‌ ప్రారంభం కావడంతో కర్నూల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఏపీలో ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు  కర్ఫ్యూ నుంచి వెసులుబాటు ఇవ్వడంతో ఆ రాష్ట్రానికి చెందిన బస్సులు హైదరాబాద్‌కు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ కు వెళ్లాల్సిన వారు కర్నూల్‌ నుంచి ఆటోల్లో జిల్లాలోని అలంపూర్‌ చౌరస్తాకు చేరు కున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు ఎక్కుతున్నారు. 


సరిహద్దులు బంద్‌

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌తో రాష్ట్ర సరిహద్దుల నుంచి రాకపోకలు నిలిచిపోయా యి. రాజోలి శివారులో తుంగభద్రానదిపై నిర్మించిన సుంకేసుల డ్యాంపైన తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దులో ఏపీ పోలీసులు కాపలా ఉన్నారు. దీంతో గద్వాల, అయిజ పట్టణాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు తదితర పట్టణాలకు వెళ్లే వారు గంటల తరబడి డ్యాంపై వేచి ఉన్నారు. వారు రాష్ట్రంలో ప్రవేశించేందుకు ఏపీ పోలీసులు అనుమతించలేదు. దీంతో కొందరు వెనుదిరిగారు. 

Updated Date - 2021-05-07T04:41:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising