ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయం భారమాయె..

ABN, First Publish Date - 2021-10-18T04:22:33+05:30

వ్యవసా యం భారమవుతోంది. ఈసారి వానాకాలంలో రైతులు సాగు చేసుకున్న పంటలకు నష్టం తప్పేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బోయిన్‌పల్లిలో వర్షాలతో మొలవని వేరుశనగ పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పత్తి, వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం

మరో సారి వర్షం కురిస్తే వరికి తప్పని గండం

వానాకాలంలో రైతులకు పెట్టుబడి అయినా దక్కేనా..?  

ఆందోళనలో అన్నదాతలు   

నారాయణపేట రూరల్‌, అక్టోబరు 17 : వ్యవసా యం భారమవుతోంది. ఈసారి వానాకాలంలో రైతులు సాగు చేసుకున్న పంటలకు నష్టం తప్పేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత పత్తి సాగు చేసుకున్న రైతులకు వర్షాలతో ఎర్రతెగులు సోకి నష్టం వాటిల్లింది. దీంతో పత్తి పంటలు అంతంత మాత్రమే కాస్తున్నాయి. అనంతరం వరి, వేరుశనగ పంటలను రైతులు సాగు చేశారు. తిరిగి వర్షాలు ఆగకపోవడంతో కొద్దిమేర వరి పంటలు పరవా లేదనుకున్నా, వేరుశనగ పంటలకు మాత్రం విత్తనాలు విత్తడం ప్రారంభం నుంచి వర్షాలు కురవడంతో వేరుశనగ మొలకలు ఆశించిన స్థాయిలో రాక రైతులు ఆందోళనకు గురయ్యారు. కొందరు రైతులు వేరుశనగ విత్తనాలు చెరిపి తిరిగి విత్తనాలు వేసేందుకు సైతం సిద్ధమయ్యారు. పేట మండలంలో దాదాపు 4వేల ఎకరాల్లో వేరుశనగ సాగవగా వరి 12000 ఎకరాల్లో సాగైంది. పత్తి 11,000 ఎకరాల్లో సాగవగా జొన్న 1,000 కందులు 13000 ఎకరాల్లో సాగయ్యాయి. వరి పంటలు సాగుచేసి దాదాపు మూడు నెలలు కావస్తుండటంతో ఇప్పటికే వరి పంట పొట్ట దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వర్షం వచ్చిందంటే నేలకొరిగి విత్తనాలు రాలే ప్రమాదం ఉందని రైతులు ఆవేదనకు గురౌతున్నారు. ఏదిఏమైనా రైతులకు వర్షాకాలం సాగు అచ్చురావడం లేదని వాపోతున్నారు. వరుణ దేవుడు కరుణించి ఇప్పటికైనా సహకరిస్తే కనీసం పెట్టుబడి అయినా వచ్చే అవకాశముందుని రైతులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-10-18T04:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising