ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గన్నీ బ్యాగులపైనా ప్రచారమా?

ABN, First Publish Date - 2021-10-29T05:28:56+05:30

రాష్ట్రంలో రైతు ల నుంచి వరిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గన్నీ బ్యాగులు ఇస్తే, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లోగోను ముద్రించి అన్ని తామే చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మ చారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మండిపడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి


మహబూబ్‌ నగర్‌ (క్లాక్‌టవర్‌), అక్టోబరు 28 : రాష్ట్రంలో రైతు ల నుంచి వరిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గన్నీ బ్యాగులు ఇస్తే, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లోగోను ముద్రించి అన్ని తామే చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు, పద్మజా రెడ్డితో కలిసి ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిఽధులతో రైతులకు చేసే సహాయం తమ దేనంటూ ఫోజులిస్తూ ప్రజలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మభ్యపె డుతోందని అన్నారు. రైతులు వరి సాగు చేస్తే ఇక ఉరేనని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్న దని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్ర భుత్వం రైతువ్యతిరేక విధానాలను విడనాడాలని, లేనిచో రైతుల తరపున ఉద్యమానికి సిద్ధం అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పోతుల రాజేందర్‌రెడ్డి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising