ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగమాగం

ABN, First Publish Date - 2021-10-21T05:37:31+05:30

ఓవైపు ప్రభుత్వాలు వరి సాగు వద్దంటున్నా ఏళ్లుగా బీడు పడిన భూములకు నీళ్లు రావడంతో మెజారిటీ రైతులు వరి వైపే మొగ్గుతున్నారు. అతివృష్టి కారణంగా పలుమార్లు, వడగండ్ల వానతో కొన్ని సార్లు, కల్లాల్లో ధాన్యం ఉన్నప్పుడు వర్షాలు పడి ఇంకొన్నిసార్లు పంటనష్టపోయి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది.

వనపర్తి జిల్లా కొత్తకోటలో వరికి అగ్గి తెగులు సోకడంతో పంటకు నిప్పుపెట్టిన రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుడిదోమ, అగ్గి తెగులు, ఆకునల్లి తెగులుతో తీవ్ర పంట నష్టం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా నష్టపోతున్న రైతులు

సన్నరకాల వరి పంటపై ఎక్కువగా ప్రభావం చూపుతున్న వైనం

6.31 లక్షల ఎకరాల్లో సన్న రకాల సాగు

అధిక యూరియా వాడకం, నీరు నిల్వ ఉండటమే కారణం

 ప్రారంభ దశలో గుర్తించకపోతే వేగంగా పంట అంతా విస్తరణ


వనపర్తి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఓవైపు ప్రభుత్వాలు వరి సాగు వద్దంటున్నా ఏళ్లుగా బీడు పడిన భూములకు నీళ్లు రావడంతో మెజారిటీ రైతులు వరి వైపే మొగ్గుతున్నారు. అతివృష్టి కారణంగా పలుమార్లు, వడగండ్ల వానతో కొన్ని సార్లు, కల్లాల్లో ధాన్యం ఉన్నప్పుడు వర్షాలు పడి ఇంకొన్నిసార్లు పంటనష్టపోయి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డు రకాలు కొనుగోలు చేయ లేమని, కచ్చితంగా సన్నరకాలు సాగుచేయాలని సూచిస్తుం డటంతో మెజారిటీ రైతులు సన్నరకాలవైపు మొగ్గుతున్నారు. సన్నరకాల దిగుబడి దొడ్డురకాల కంటే తక్కువగా ఉండటమే కాకుండా ఎక్కువగా తెగుళ్ల బెడద ఉంటోంది. ఈ నేపథ్యంలో సన్నరకాల సాగు చేపట్టిన రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. అలాగే పంట తీవ్రంగా నష్టపోయి అప్పులపాలు కావాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రతీఏటా తెగుళ్ల బెడదను ఎదుర్కొంటు న్నప్పటికీ.. గతేడాది నుంచి సన్నరకాల సాగు ఎక్కువగా కావడంతో తెగుళ్ల బెడద మరింత తీవ్రం అయ్యింది. ప్రస్తుత సీజన్‌ పంట ప్రస్తుతం పొట్ట దశలో, కంకి దశలో ఉంది. ఈ క్రమంలో పంటకు సుడి దోమ, అగ్గితెగులు, ఆకునల్లి తెగులు సోకుతుం డటంతో కొన్నిచోట్ల రైతులు పంట నష్ట పోయిన వరకు తొలగించడమో లేదా పంటకు నిప్పు పెట్టడం లాంటివి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితికి ప్రధానంగా యూరియా అధికవాడకం ఒక కారణమైతే, మరో కారణం ఎక్కువ రోజులు వరిలో నీరు నిల్వ ఉండటం మరో కారణంగా చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బోర్ల కింద పారకం కంటే కాలువల కింద పారకం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అనివార్యంగా పంట పొలాల్లో నీరు నిల్వ ఉంటోంది. అలాగే పంట ఏపుగా పెరగడం కోసం యూరియా అధికంగా వాడుతుండటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గిపోవడం వల్ల పంటలు తెగుళ్లకు గురవుతున్నాయని చెప్పవచ్చు.


ఉమ్మడి జిల్లాలో ..

ప్రభుత్వమే సన్నరకాల సాగును ప్రోత్సహిస్తుం డటంతో గతంలో మెజారిటీ దొడ్డురకాలు సాగుచేసే రైతులు కూడా సన్నాల సాగుకు మొగ్గుచూ పుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేవలం సన్నరకాల సాగే.. దాదాపు 4.73 లక్షల ఎకరాల్లో అవుతోంది. మిగిలిన 1.58 లక్షల ఎకరాల్లో మాత్రమే దొడ్డురకాలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఈ సూడిదోమ, అగ్గితెగులు, ఆకునల్లి ప్రభావం ఎక్కువగా ఉన్నది. ప్రధానంగా అగ్గితెగులు సోకితే వేగంగా పంట నాశనం అవుతోంది. ప్రారంభంలోనే గుర్తించకపోతే వేగంగా విస్తరిస్తోంది. కొత్తకోట మండలంలో బుచ్చిరెడ్డి అనే రైతు తనకున్న పంటలో కొంతభాగం అగ్గితెగులు సోకడంతో పంటకు నిప్పుపెట్టాడు. చాలామంది రైతులు అగ్గి తెగులు గుర్తించడంలో ఆలస్యం చేయడం వల్ల కూడా వ్యాప్తి ఎక్కువగా అవుతోంది. దొడ్డురకాల పంటకు ఇలాంటి బెడద లేదు. కేవలం సన్నరకాలకు మాత్రమే తెగుళ్ల బెడద తీవ్రంగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. ఆకునల్లి వల్ల ధాన్యం నల్లగా మారినా కొనుగోలు చేయాలని, లేకపోతే మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. 


ముందుగా గుర్తిస్తేనే అడ్డుకట్ట

వానాకాలం సీజన్‌లో వరిలో సూడిదోమ, అగ్గితెగులు, ఆకు నల్లి తెగుళ్ల బెడద తీవ్రంగా ఉంది. రైతులు ముందుగా గుర్తించకపోవడం వల్ల కూడా నష్టం ఎక్కువగా జరుగుతోంది. పంటలో ఈ తెగుళ్లు ప్రారంభ మైనప్పుడే వ్యవసాయాధి కారులను సంప్రదించి.. క్రిమీసంహారక మందులు పిచికారీ చేస్తేనే తెగుళ్లకు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రస్తుతం సన్నరకాల్లో తెగుళ్లు ఉన్నాయి. 

- షేక్‌ మున్నా, ఏఓ, కొత్తకోట, వనపర్తి జిల్లా 

మిగతా పంటను కాపాడుకోవడానికే

నాకున్న అయిదెకరాల్లో వరిపంట సాగుచేశాను. సాగు నీటికి ఎలాంటి ఢోకా లేదు. అయితే సన్నరకాల సాగును ఎక్కువగా చేయడంతో వరిలో అగ్గితెగులు, సుడిదోమ, ఆకు నల్లి ప్రారంభమైంది. వేగంగా ఒకచోట ప్రారంభమై వేగంగా విస్తరిస్తుండటంతో మిగతా పంటను కాపాడుకోవడానికి తెగుళ్లు సోకిన పంటకు నిప్పుపెట్టాను. ప్రభుత్వం పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలి

- బుచ్చిరెడ్డి, రైతు, కొత్తకోట, వనపర్తి జిల్లా 

రెండుసార్ల పిచికారికి రూ. 25 వేల ఖర్చు 

నా వరి పొలం ఇప్పుడు పొట్టదశలో ఉన్నది. సుడి దోమ అధికంగా ఉండటంతో పంట నష్టం తీవ్రంగా ఉన్నది. మూడు ఎకరాల పొలంలో మొత్తం సన్నరకాలు సాగుచేశాను. దోమ బెడద తీవ్రంగా ఉండటం వల్ల రెండుసార్లు దోమ నివారణ కోసం సిప్రొమెస్టిన్‌ ద్రావణాన్ని పిచాకారీ చేశాను. ఇప్పటికే పిచికారీ కోసం రూ. 25వేలు ఖర్చు చేశాను. పంట రావడానికి మరో 30 రోజుల సమయం పడుతుంది. 

- కురుమూర్తి, రైతు, వీపనగండ్ల, వనపర్తి జిల్లా 

Updated Date - 2021-10-21T05:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising