ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం

ABN, First Publish Date - 2021-10-19T05:11:13+05:30

ప్రతీరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యప్రజల నడ్డి విరుస్తున్నదని యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వాసుయాదవ్‌, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ అధ్యక్షు డు జె చంద్రశేఖర్‌ అన్నారు.

ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలుపుతున్న యువజన కాంగ్రెస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలి  

ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్‌

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 18 : ప్రతీరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యప్రజల నడ్డి విరుస్తున్నదని యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వాసుయాదవ్‌, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ అధ్యక్షు డు జె చంద్రశేఖర్‌  అన్నారు. రోజూ కొంత భారం మోపడం వల్ల పెట్రోల్‌ లీటర్‌ రూ.110కి చేరిందని ఇలా అయితే వాహనాలు ఎలా నడుపుతారని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలను నిరసిస్తూ సోమవారం యువజన కాంగ్రె స్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, వెంటనే పెరిగిన ధరలను నియం త్రించాలని డిమాండ్‌ చేశారు. వాహనాలు బయటకు తీయాలంటే జనం భయపడుతున్నారన్నారు. హైదరాబాద్‌కు అద్దె వాహనాలు తీసుకెళ్లా లంటే ఇది వరకు రూ.2500కాగా ఇప్పుడు రూ.3వేలకు పైగా అడుగుతున్నా రన్నారు. అన్ని వర్గాల ప్రజలపై పెంచిన ఇంధన భారం పడుతుందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించు కోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు రాములుయాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫసియొద్దీన్‌, నాయకు లు శివ శంకర్‌గౌడ్‌, అనిల్‌రెడ్డి, అంజి, రవి, సాయికుమార్‌, మోహన్‌నాయక్‌, గుర్నాథ్‌రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్‌యాదవ్‌  పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-19T05:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising