ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూన్‌ నాటికి 50వేల ఎకరాలకు సాగు నీరివ్వాలి

ABN, First Publish Date - 2021-11-28T05:06:49+05:30

కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో 50వేల ఎకరాలకు వచ్చే జూన్‌ నాటికి సాగునీరు ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌ రాజేందర్‌ రెడ్డి కోరారు.

హైదరాబాద్‌లో జలసౌధ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యేలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డి

- జలసౌధ అధికారులతో కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు పనులపై సమీక్ష


దేవరకద్ర/భూత్పూర్‌, నవంబరు 27 : కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో 50వేల ఎకరాలకు వచ్చే జూన్‌ నాటికి సాగునీరు ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌ రాజేందర్‌ రెడ్డి కోరారు. ఈ హైదరాబాద్‌లో జలసౌధ అధికారులతో శనివారం సమావేశం జరిగింది. పాల్గొన్న ఎమ్మెల్యేలు  మా ట్లాడుతూ 50వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పెండింగ్‌లో ఉన్న పనులను చేపట్టాలని కోరారు. భూ సేక రణ పూర్తి చేసి, కాలువల పనులను వెంటనే పూర్తి చేయా లని కోరారు.  అదేవిధంగా కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు కుడి, ఎ డమ కాలువల మిగిలిపోయిన పనులను పూర్తి చేసి చిన్న చింతకుంట, దేవరకద్ర మండలాల్లో మరో 13500 ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులను కోరారు. కోయిల్‌ సాగర్‌ గ్రావిటీ కెనాల్‌ పనులను పూర్తి చేస్తే 11గ్రామాల ప రిధిలో 55వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికా రులకు సూచించారు. ఈ పనులన్నింటినీ వచ్చే జూన్‌ నాటికి పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు జలసౌధ అధికారులను కోరారు. కార్యక్రమంలో  కోయిల్‌సా గర్‌ ప్రాజెక్టు సీఈ రమేష్‌, ఎస్‌ఈ నర్సింగ్‌రావు, ఈఈ ప్ర తాప్‌సింగ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహా రెడ్డి, జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌, నాయకులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising