ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1.03 లక్షల ఇళ్లను సర్వే చేశాం

ABN, First Publish Date - 2021-05-22T05:28:33+05:30

కరోనా కట్టడికి రాష్ట్ర ప్ర భుత్వం విధించిన లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తు న్నామని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా సీఎం కేసీఆర్‌కు వివరించారు.

సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ అపూర్వారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి కిట్లు అందించాం

- అందుబాటులో రెమ్‌డిసివిర్‌, ఆక్సిజన్‌, మందులు

- 1.7 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం 

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా


వనపర్తి రూరల్‌, మే 21 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్ర భుత్వం విధించిన లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తు న్నామని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా సీఎం కేసీఆర్‌కు వివరించారు. వరంగల్‌ నుంచి సీఎంకేసీఆర్‌ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొవిడ్‌ పరిస్థితు లు, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ఆ సుపత్రుల సూపరింటెండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ని ర్వహించారు. ఈ సందర్భంగా వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఫీవర్‌ సర్వేలో భాగంగా జిల్లాలో మొదటి విడతలో 1.03 లక్షల ఇళ్లను సందర్శించామని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి గర్తించి, వారికి హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేశామని వివరించారు. రె మ్‌డిసివిర్‌, ఆక్సిజన్‌, మందులు స్టాక్‌ ఉన్నాయని చె ప్పారు. కోవిడ్‌ వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రం చే యాలని, రోగులకు అవసరమైన మంచినీటి సదుపా యం కల్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలె క్టర్‌ సూచించారు. ఆక్సిజన్‌, మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. రెండో విడత ఫీవర్‌ సర్వేను త్వరితగతిన పూర్తి చేసి, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచి రోజు వారీగా ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారికు సూచించారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఎవరూ బయటకు తిరగరాద ని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలను కాపా డేందుకు కరోనా చైన్‌ లింక్‌ తెంపడమే మార్గమని ప్ర భుత్వం వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నదని, ఇందుకు ప్రజలు పోలీసు, జిల్లా యం త్రాంగానికి సహకరించాలని కోరారు. రోహిణి కార్తె వస్తున్నందున ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాల ని, ఇప్పటి వరకు 1.7 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగో లు చేశామని, ఇంకా వచ్చే అవకాశమున్నందున వచ్చే 10 రోజులలోగా మొత్తం దాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఎస్పీ అపూర్వ రావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హరీష్‌, ఆర్‌ఎం వో చైతన్య పాల్గొన్నారు.

Updated Date - 2021-05-22T05:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising