ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి కావాలి

ABN, First Publish Date - 2021-10-19T05:26:11+05:30

జిల్లాలోని అన్ని మండలాలలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ వల్లూరుక్రాంతి అధికారులను ఆదేశించారు.

ప్రజావాణిలో ఫిర్యాదులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, అక్టోబరు 18 : జిల్లాలోని అన్ని మండలాలలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ వల్లూరుక్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరం లో జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయాలన్నారు. ఆశ, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి తిరిగి వివరాలు తెలుసుకోవాలని చెప్పారు. ఇప్పటివరకు ఎంత మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందో జాబితా తయారు చేసుకోవాలని సూచించారు. మిగిలిపోయిన వారందరికీ టీకా వేయించాలని ఆదేశించారు. మండలాల వారీగా ఎంత శాతం వ్యాక్సిన్‌ పూర్తి అయ్యింది, ఎన్ని సబ్‌ సెంటర్లు ఉన్నాయి తదితర వివరాలను మండల ప్రత్యేక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల జనాభాను బట్టి అవసరమైతే వ్యాక్సినేషన్‌ కేంద్రాల సంఖ్యను పెంచాలని సూచించారు. స్పెషల్‌ అధికారులు సిబ్బందితో సమావేశాలు నిర్వహించి, అందరూ వాక్సినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారో లేదో తనిఖీ చేసుకోవాలని చెప్పా రు. వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి, వ్యాక్సినేషన్‌ లక్ష్యం పూర్తి చేయాలని అదేశించారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. 


భూ సమస్యలు పరిష్కరించాలి

దరణి భూసమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె  ఆట్లాడారు. మ్యుటేషన్‌, ప్రజావాణి ఫిర్యాదులు, నాలా తదితర ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. లాగిన్‌లో స్ర్పెడ్‌ షీట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, అన్ని కాలమ్స్‌ను పూర్తి చేసి తేదీతో పాటు తప్పనిసరిగా రిమార్క్‌ చేసి నివేదిక పంపించాలన్నారు. లోకాయుక్త, ఎస్సీ, ఎస్టీ కేసులు క్లియర్‌ చేయాలన్నారు. మండలాల వారిగా పెండింగ్‌ ఉన్న భూ సమస్యలపై సమీక్ష చేశారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలు, రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ, ఆర్డీవో రాములు, ఏవో శ్యాం  పాల్గొన్నారు. ఉన్నారు.


ప్రజావాణికి 50 ఫిర్యాదులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 50 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. అందులో భూ సమస్యలు, ఆసరా పెన్షన్లకు సంబం ధించినవే ఎక్కువగా ఉన్నాయన్నారు. సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి వాటిని పరిష్కరించేలా చూస్తామన్నారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్క రించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీహర్ష, రఘురామ్‌శర్మ, ఆర్డీవో రాములు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T05:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising