మేడిగడ్డ బ్యారేజీ 24 గేట్లు ఎత్తివేత
ABN, First Publish Date - 2021-07-21T14:39:06+05:30
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంది.
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు బ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 45,190 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 34,720 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 9.166 టీఎంసీలుగా కొనసాగుతోంది.
Updated Date - 2021-07-21T14:39:06+05:30 IST