ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారు: Madhavi Latha సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-12-25T19:11:01+05:30

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై బీజేపీ నేత, సినీ నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారంటూ మాధవీలత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై బీజేపీ నేత, సినీ నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారంటూ మాధవీలత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘పవన్ కళ్యాణ్ గారు..క్రిస్మస్ విషెస్ చెప్పండి.. నమ్మినవారికి విషెస్ అని చెప్పండి ఇంకా సంతోషం... మానవాళికి లాంటి పెద్దమాటలు ఎందుకండి..? మీరే మతమార్పిడిలకు ఎంకరేజ్మెంట్ చేసేలా వుంది మీ పోస్ట్..విషెస్ పెట్టండి చాలు.. బైబిల్‌ని మనమే బోధించనక్కర్లేదు. అక్కడ ఎవరూ దేవుడు లేరు. రెస్పెక్ట్ ఇద్దాం అంతవరకే.. మీరు చెప్పిన విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు. సర్వ ప్రాణుల పట్ల అని ఏసు చెప్పలేదు. ఆయన చెప్పారని నేనూ మొన్నటిదాకా మీలాగే నమ్మా.. కానీ, యూదుల వరకే ఆయన ప్రేమ. మనం యూదులం కాదు. మీ పేజి మెయిన్‌టేన్ చేస్తున్నవాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచిది. మొన్న మీరు కూడా బైబిల్ గురించి గొప్పగా చెప్పారు. అంత గొప్పేంలేదండీ.. ఫ్లోలో చెప్పి మీరు కూడా మతమార్పిళ్లకు కారణం అవ్వొద్దు. చాలా బాధగా ఉంది నాకు. మీ పోస్టులో విషెస్ కంటే మతమార్పిళ్లకు సపోర్టు చేస్తున్నట్టు వుంది. ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తంచేస్తున్నాను.’’ అని మాధవీలత తన పోస్టులో పేర్కొన్నారు. ఇదే అంశంపై ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.


పవన్ కల్యాణ్ చేసిన పోస్ట్ ఇదే..

‘‘క్రిస్మస్ శుభాకాంక్షలు

'దైవం మానుష రూపేణా'... మానవునిగా జన్మించి.. మానవులను ప్రేమించి.. మానవులను జాగృతపరచడానికి దివికి ఏతెంచిన దైవపుత్రుడు ఏసుక్రీస్తు. ఆ అవతార పురుషుని జన్మదినం మానవాళికి గొప్ప పర్వదినం. ఏసు నామమును స్మరిస్తూ, ఏసు ప్రభువు పట్ల అచంచల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. సర్వ ప్రాణుల పట్ల కరుణ, ప్రేమ, సేవాభావం చూపాలని క్రీస్తు చేసిన బోధనలు ఎల్లవేళలా ఆచరణీయం. క్షమ, దయ కలిగి ఉండడమే క్రీస్తుపై  భక్తికి తార్కాణం. దుర్బుద్ధితో ఉన్నవారికి సద్బుద్ధిని, ఆశ్రిత జనులకు సుఖసంతోషాలను ప్రసాదించమని ఆ కరుణామయుణ్ణి ప్రార్ధిస్తున్నాను.’’ అంటూ తెలుగుతోపాటు ఇంగ్లీషు, హిందీ భాషల్లోనూ పవన్ కల్యాణ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ మాధవీలత కౌంటర్ పోస్ట్ పెట్టారు.



Updated Date - 2021-12-25T19:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising