గోవా క్యాంపునకు ‘స్థానిక’ సభ్యులు
ABN, First Publish Date - 2021-11-30T09:04:02+05:30
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ తమ సభ్యులను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలిస్తున్నాయి.
ఖమ్మం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ తమ సభ్యులను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలిస్తున్నాయి. టీఆర్‌ఎస్ తరఫున తాతా మధుసూదన్ పోటీ చేస్తుండగా, ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులను నేతలు గోవా క్యాంపునకు తరలిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బస్సుల్లో వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడినుంచి కొందరు సభ్యులను విమానంలో, మరికొందరిని బస్సుల్లో గోవాకు పంపిస్తున్నారు. చిన్నపిల్లలున్న స్థానిక సంస్థల ప్రతినిధులు కొందరు కుటుంబంతో గోవాకు తరలుతున్నారు. కొందరు సోమవారం పయనమయ్యారు. మరికొందరు మంగళవారం బయలుదేరనున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు కూడా ఆ పార్టీకి చెందిన సభ్యులను మారేడుమిల్లి వైపు క్యాంపునకు తరలించారు.
Updated Date - 2021-11-30T09:04:02+05:30 IST