పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి
ABN, First Publish Date - 2021-10-21T10:01:29+05:30
డిసెంబరు నెలకు సంబంధించిన పెన్షన్‌ను పొందాలంటే ఉద్యోగ పెన్షనర్లు నవంబరు 30లోగా తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలని..
నవంబరు 30లోగా సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేత
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు నెలకు సంబంధించిన పెన్షన్‌ను పొందాలంటే ఉద్యోగ పెన్షనర్లు నవంబరు 30లోగా తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలని అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయంలోని పే అండ్ అకౌంట్స్ విభాగం సూచించింది. ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేవారు మీ-సేవా కేంద్రాలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులను వినియోగించుకోవాలని తెలిపింది. ఆన్‌లైన్ డిజిటల్ సర్టిఫికెట్లు సమర్పించడం వీలుకాని పెన్షనర్లు...ఏజీ ఆఫీసులోని పే అండ్ అకౌంట్స్ ఆఫీసు-3లో నేరుగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలని పేర్కొంది. గడువులోగా సర్టిఫికెట్లను సమర్పించకపోతే డిసెంబరు పెన్షన్‌ను నిలిపివేస్తామని హెచ్చరించింది.
Updated Date - 2021-10-21T10:01:29+05:30 IST