ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కథా కేళి’ పుస్తకం ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-01-18T09:09:21+05:30

ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి చేతుల మీదుగా ఆదివారం 111 మంది రచయిత్రుల కథల సంకలనం ‘కథా కేళి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జేవీ పబ్లికేషన్స్‌, త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

111 మంది రచయిత్రుల కథల సంకలనమిది


చిక్కడపల్లి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి చేతుల మీదుగా ఆదివారం 111 మంది రచయిత్రుల కథల సంకలనం ‘కథా కేళి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జేవీ పబ్లికేషన్స్‌, త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి డి.కామేశ్వరితో పాటు కథాకేళి పుస్తకాన్ని పరిచయం చేసిన రచయిత్రి మంథా భానుమతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏకంగా 111 మంది మహిళా రచయితల కథలతో జేవీ పబ్లికేషన్స్‌ వినూత్న కథాప్రయోగం చేసిందని చెప్పారు. మొన్నటితరం రచయిత్రులు డి.కామేశ్వరి, జ్ఞానప్రసూన, శారదా అశోకవర్ధన్‌, నిన్నటి తరం రచయిత్రులు పొత్తూరి విజయలక్ష్మి, మంథా భానుమతి, రాజేశ్వరి శివుని, నేటి తరపు కొత్త రచయిత్రులు కవిత, తులసి మొదలైన ఎంతోమంది రచయిత్రులు, రచయితలను కలిసి రాసిన కథలతో తయారైన అందమైన పుస్తకం కథాకేళి అని అన్నారు. కాగా, అత్యధిక మంది రచయిత్రుల కథల పుస్తకంగా తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ను ఈ పుస్తకం సొంతం చేసుకుంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి ధ్రువపత్రం అందజేశారు. రచయిత్రి జ్యోతి వలబోజు కార్యక్రమాన్ని పూర్తిగా పర్యవేక్షించి మాట్లాడారు. ఈ పుస్తకాలు ‘అచ్చంగా తెలుగు’ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చనన్నారు. 

Updated Date - 2021-01-18T09:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising