ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల భూముల వివాదంపై మాట మార్చిన సర్పంచ్

ABN, First Publish Date - 2021-05-02T00:16:29+05:30

మంత్రి ఈటల రాజేందర్ భూముల వివాదంపై మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట సర్పంచ్ లక్ష్మి మాట మార్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ భూముల వివాదంపై మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట సర్పంచ్ లక్ష్మి మాట మార్చారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదయం బలవంతంగా భూములు లాక్కోలేదని లక్ష్మి మీడియా ఎదుట స్పష్టంగా చెప్పారు. రెండు లక్షలకు ఎకరా భూమిని కొందరు అమ్ముకున్నారని చెప్పింది. అయితే టీఆర్‌ఎస్ నేతల ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాట మార్చారు. ఇప్పుడు తమ మూడెకరాల భూమి ఈటల లాక్కున్నారని, తమకు సీఎం కేసీఆర్ న్యాయం చేయాలని చెప్పారు. ‘అమ్ముకున్నారని నేను అన్నానా.. ఏమో నాకు తెలియదు’ అని లక్ష్మి మీడియాతో చెప్పారు.


మంత్రి ఈటల రాజేందర్ భూ వివాదంపై అచ్చంపేట సర్పంచ్ లక్ష్మి స్పందించిన విషయం తెలిసిందే. బలవంతంగా ఎవరి దగ్గర నుంచి ఈటల భూమి గుంజుకోలేదని తెలిపారు. అయితే పిల్లల పెళ్లిళ్ల కోసం ఎకరా భూమిని రెండు లక్షల రూపాయల చొప్పున కొందరు అమ్ముకున్నారన్నారని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు పైసలు అడగడం కరెక్ట్ కాదన్నారు. కొందరు వ్యక్తులు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోందని లక్ష్మి తెలిపిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-05-02T00:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising