భక్తిశ్రద్ధలతో వీరభద్రస్వామికి త్రిశూలస్నానం
ABN, First Publish Date - 2021-03-19T05:25:49+05:30
భక్తిశ్రద్ధలతో వీరభద్రస్వామికి త్రిశూలస్నానం
కురవి, మార్చి 18 : వీరభద్రస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం భద్రకాళి సమేత వీరభద్రస్వామికి త్రిశూల స్నానం పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వైష్ణవ ఆలయాల్లో చక్రస్నానం తరహా లో, శైవ ఆగమశాస్త్రం ప్రకారం వేద పండితు లు స్వామి వారికి, అమ్మ వారికి కురవి పెద్దచెరువులో త్రిశూలస్నానం చేయించారు. కుర వి బ్రహోత్సవాల్లో స్వామి వారికి త్రిశూల పూజా కార్యక్రమం చేపట్టడం ఇది వరుసగా ఐదో సంవత్సరం. వివిధ స్థలాల నదుల్లోని నీటిని కలశాల్లో తీసుకువచ్చిన అర్చకులు స్వామి వారికి ప్రదక్షణలు చేసి శాస్త్రోక్తంగా స్నానమాచరింపజేశారు. ఈత్రిశూల స్నానం ఫలితంగా మూడులోకాల్లోని నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రతీతి. దీంతో భక్తులు ఈ పుణ్యస్నానానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈపూజా కార్యక్రమా న్ని వేదపండితులు శివకిరణ్‌శర్మ, రవిచంద్రశర్మ, ఆలయఅర్చకులు రామన్న, రెడ్యాల శ్రీని వాస్, విజయ్, అనిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాదావత్ రామునాయక్, ఈవో సత్యనారాయణ, నూతక్కి నర్సింహారావు పాల్గొన్నారు.
ఘనంగా వీరభద్రుడి వసంతోత్సవం
వీరభద్రస్వామి వారి వసంతోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించా రు. రాబోయే కొత్త సంవత్సర చైత్రమాసానికి గుర్తుగా ఈకార్య్రమాన్ని నిర్వహించారు. ఆల యం మొత్తం స్వామి వారిని పూజించిన పసుపు నీళ్లు చల్లుతూ వీరభద్రస్వామిని ఊరేగించారు. అంతకుముందు గురువారం రాత్రి 7 గంటలకు ధ్వజపట ఉద్వాసన, శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు శివాలయం వద్ద తెప్పోత్సవం నిర్వహిస్తారు.
వైభవంగా నాగవెళ్లి, ఏకాంత సేవ
భద్రకాళి సమేత వీరభద్రుడి కల్యాణోత్సవాల్లో గురువారం రాత్రి 7గంటలకు స్వామివారి నాగవెళ్లి, ఏకాంత సేవ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నాగవెళ్లి కార్యక్రమంలో భాగంగా స్వామి వారిని, అమ్మవారి ని ప్రత్యేక సొమ్ములతో అలంకరించారు. అనంతరం ఏకాంత సేవా పూజా కార్యక్రమా న్ని నిర్వహించారు.
Updated Date - 2021-03-19T05:25:49+05:30 IST