ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు గ్రేటర్ హైదరాబాద్‌లో పర్యటించనున్న కేటీఆర్

ABN, First Publish Date - 2021-12-30T14:16:33+05:30

నేడు గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.నాలాల విస్తరణ, అభివృద్ధిలో మొదటి అడుగు పడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : నేడు గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.నాలాల విస్తరణ, అభివృద్ధిలో మొదటి అడుగు పడుతోంది. స్ర్టాటజిక్‌ నాలా డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఎన్‌డీపీ)లో భాగంగా నాలా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనుల ప్రారంభానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. హుస్సేన్‌సాగర్‌ సర్‌ప్లస్‌ నాలాపై కవాడిగూడ బ్రిడ్డి నుంచి మూసీ వరకు ఇరువైపులా రూ.68.40 కోట్లతో చేపట్టనున్న ఆర్‌సీసీ రిటైనింగ్‌ వాల్‌ (ప్రస్తుతం గోడ లేని చోట) నిర్మాణ పనులకు కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ తదితరులు శంకుస్థాపన చేయనున్నారు. వరద ముంపునకు చెక్‌ పెట్టే క్రమంలో నాలాల విస్తరణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎస్‌ఎన్‌డీపీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి సాధ్యాసాధ్యాలు, అవసరాన్ని బట్టి నాలాలను వెడల్పు చేయడం, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులను ఆ విభాగం చేపడుతోంది. 52 పనులకుగాను ఇప్పటి వరకు 17 పనులకు నిర్మాణ సంస్థల ఎంపిక పూర్తయ్యింది. 15 పనులు టెండర్‌ దశలో ఉండగా, 21 పనులకు సంబంధించి డీపీఆర్‌ సిద్ధమవుతోంది. 

Updated Date - 2021-12-30T14:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising