కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభం
ABN, First Publish Date - 2021-08-11T18:09:21+05:30
కాగజ్ నగర్‌లో కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అరికె పూడి గాంధీ, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్,
కొమురం భీం ఆసిఫాబాద్: కాగజ్ నగర్‌లో కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అరికె పూడి గాంధీ, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. పేదల ఆకలి తీర్చేందుకు నిత్యాన్నదానానికి పూనుకున్న ఎమ్మెల్యే కోనప్పను సహచర ఎమ్మెల్యేలు అభినందించారు. నిత్యాన్నదానం చేయడం మామూలు విషయం కాదని.. శ్రమ, ఖర్చుతో కూడుకున్నదన్నారు. అన్నింటికి భరించి కోనప్ప సత్రాన్నే నిర్మించడం గొప్ప విషయమని విప్ గాంధీ కొనియాడారు.
Updated Date - 2021-08-11T18:09:21+05:30 IST