ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని పార్టీల వారితో మాట్లాడుతా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-03-15T23:13:36+05:30

కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత ముఖ్య అనుచరులతో విశ్వేశ్వర్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత ముఖ్య అనుచరులతో విశ్వేశ్వర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలని, ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన రాజీనామా నిర్ణయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పానని తెలిపారు. కాంగ్రెస్‌లో ఉంటే ముందుకు వెళ్లలేక పోతున్నానని చెప్పారు. మూడు మాసాలు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇప్పుడు అన్ని పార్టీల వారితో మాట్లాడుతానని ప్రకటించారు. బీజేపీలోకి వెళ్లాలా, టీజేఎస్‌లోకి వెళ్లాలా, రాజకీయాల నుంచి తప్పుకోవాలా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని కొండా విశ్వశ్వర్‌రెడ్డి తెలిపారు.


2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి విశ్వేశ్వర్‌రెడ్డి గెలిచారు.  ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి చేవెళ్ల నుంచి పోటీ చేయగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అధికార పార్టీ టీఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యమని పలు వేదికలపై ప్రకటించిన ఆయన.. సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై తనదైన శైలిలో నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో ముందుంటారు. తెలంగాణ రాజకీయాల్లో కొండా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.   

Updated Date - 2021-03-15T23:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising