ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్న పులి

ABN, First Publish Date - 2021-01-17T14:20:21+05:30

ఏ2 పులి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. పులి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమురంభీం జిల్లా: ఏ2 పులి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. పులి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటోంది. రాత్రి వేళల్లో పులి దర్జాగా సంచరిస్తోంది. రాత్రి పూట మత్తు మందు ప్రయోగానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయి. ఒక వేళ ప్రయోగం చేసినా చీకట్లో బంధించడం ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. గిరిజనుల ప్రాణాలు తీస్తున్న పులిని బంధించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది.


బెజ్జూరు మండలం, కంది భీమన్న అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. దానిని పట్టుకునేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు అదే అటవీ ప్రాంతంలో తిష్ట వేశారు. వారితోపాటు రెస్క్యూ టీమ్, మత్తు మందు నిపుణులు, షూటర్లు ఉన్నారు. పులి రాగానే మంచెపై నుంచి మత్తు మందు ప్రయోగించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే 10 బోన్లు, 110 కెమెరాలను ఏర్పాటు చేశారు. విధుల్లో 60 మంది టైగర్ ట్రాకర్స్, మహారాష్ట్ర నిపుణులు ఉన్నారు. ఈ ఆపరేషన్‌ను  సీసీఎఫ్ వినోద్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2021-01-17T14:20:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising