ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలిమినేషన్‌కు చేరువలో కోదండరామ్

ABN, First Publish Date - 2021-03-20T20:26:47+05:30

మరి కాసేపట్లో టీజేఎస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కోదండరామ్ భవిత్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  టీజేఎస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కోదండరామ్ భవిత్యం మరి కాసేపట్లో తేలిపోనుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. దీనిలో భాగంగా తక్కవ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తున్నారు. బరిలో నిలవాలంటే అధిక ఓట్లు రావాలి. కానీ కోదండరామ్‌కు ఎక్కువ  ఓట్లు రాలేదు. దీంతో ఎలిమినేషన్‌కు చేరువలో కోదండరామ్ ఉన్నారు.


ఎలిమినేషన్‌‌కు దూరంగా ఉండి బరిలో ఉండాలంటే తీన్మార్ మల్లన్న‌ను దాటి 9,801 ఓట్లను కోదండరామ్ సాధించాలి. బీజేపీ ‌అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి‌కి వచ్చిన 39,107 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు  కోదండరామ్‌కు ‌కీలకం కానున్నాయి. మల్లన్నను దాటే ఓట్లు రాకపోతే తరువాత ఎలిమినేషన్‌లో కోదండరామ్ ఉంటారు.


విజయం సాధించడానికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా  రాజేశ్వర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నమధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. వీరి ఇద్దరి మధ్య కోదండరామ్ ఎలిమినేషన్ రౌండ్ కీలకంగా మారనుంది. 

Updated Date - 2021-03-20T20:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising