ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నుల పండవగా కైట్‌ ఫెస్టివల్‌

ABN, First Publish Date - 2021-01-16T04:57:45+05:30

కన్నుల పండవగా కైట్‌ ఫెస్టివల్‌

కైట్‌ ఎగురవేసి ఫెస్టివల్‌ ప్రారంభిస్తున్న వినయ్‌భాస్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేయూ క్యాంపస్‌, జనవరి 15: ప్రకృతిని సంరక్షించేవి పండుగలేనని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. సుబేదారిలోని కేయూ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛసర్వేక్షణ్‌-2021, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుక్రవారం పతంగుల సంబురాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎంపీలు పసునూరి దయాకర్‌, బండా ప్రకాశ్‌, కమిషనర్‌ పమేలా సత్పతిలు హాజరయ్యారు. 

ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో విభిన్న ఆకృతులతో కూడిన రంగురంగుల పతంగులు ఆకర్షణీయంగా నిలిచాయి. తెలంగాణతో సహా కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన 6 పతంగుల బృందాల నిపుణులు ఆకాశమే హద్దుగా పతంగులను ఎగువేశారు. కర్ణాటకలోని మంగళూరు, దొడ్డబళ్లాపూర్‌, గుజరాత్‌లోని వడదోర, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌కు చెందిన పతంగుల ప్రేమికులు ఉత్సాహంగా పతంగులను ఎగురవేశారు. బల్దియా అధికారులు పిల్లలకు, యువకులకు పతంగుల దారం, చరకా లు అందజేశారు. మైదానంలో మ్యూజికల్‌ షో, నృ త్యాలను ఏర్పాటు చేశారు. కైట్‌ ఫెస్టివల్‌కు హాజరైన వారికి ప్రత్యేకంగా ఫుడ్‌స్టాల్స్‌ ఏర్పాటు చేశా రు. కమిషనర్‌ పమేలా సత్పతితోపాటు అధికారులు పలు రకాలైన వంటలను రుచిచూశారు. స్వచ్ఛత అంశంపై ప్రజలకు అవగాహన కల్పించా రు. ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో శుక్రవారం పతంగుల సంబురాలతోపాటు సైకిల్‌ రైడింగ్‌, ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు దాస్యం వినయ్‌భాస్కర్‌, మేయర్‌ ప్రకాశ్‌రావు, ఎంపీలు పసునూరి దయాకర్‌, బండా ప్రకాశ్‌లు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జోరిక రమేశ్‌, కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.











Updated Date - 2021-01-16T04:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising