ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రంపై కేసీఆర్ తప్పుడు, విషప్రచారం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-12-19T19:45:32+05:30

కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు, విషప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు, విషప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి  మీడియాతో మాట్లాడారు. హింస, ఘర్షణలు జరిగేలా ముఖ్యమంత్రి మాట్లాడటం సమంజసం కాదన్నారు.తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని చూపించాల్సిన అవసరం వచ్చిందని.. కల్వకుంట్ల కుటుంబ పాలనపై యువత తమ పౌరుషం చూపించాలని పిలుపునిచ్చారు.రైతులను తప్పుదారి పట్టిస్తున్న టీఆర్ఎస్ నేతలను రైతులు ఉరికించాలని కిషన్‌రెడ్డి చెప్పారు. 


మతపరమైన హింస చెలరేగే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ పాలనలో హింస ప్రేరేపిత చర్యలు లేవు. అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారన్నారు.కేసీఆర్‌కు కుడివైపు అసదుద్దీన్ ఒవైసీ, ఎడమవైపు అక్బరుద్దీన్ ఒవైసీ పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌తో బీజేపీ నీతులు చెప్పించుకునే స్థాయిలో లేదన్నారు. కాశీ పునరుద్ధరణ పనులపై సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం తగదన్నారు. కేసీఆర్ యజ్ఞాలు చేయొచ్చు- బీజేపీ మాత్రం చేయొద్ద? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 


కేసీఆర్ రైతులను బయపెడుతూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ ధర్నాకు రాలేదని చెప్పారు.  హుజురాబాద్ దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేశారన్నారు. డబ్బుల ప్రవాహం ప్రవహిస్తున్న సమయంలో హుజురాబాద్ ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని కిషన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-12-19T19:45:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising