ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ అపోలోలో ఒకేసారి కిడ్నీ, కాలేయ మార్పిడి

ABN, First Publish Date - 2021-04-13T12:19:08+05:30

కాలేయం, మూత్రపిండాలను దాతల నుంచి సేకరించి విదేశీ రోగికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : కాలేయం, మూత్రపిండాలను దాతల నుంచి సేకరించి విదేశీ రోగికి ‘కాంప్లెక్స్‌ కంబైన్డ్‌ లివర్‌, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను అపోలో వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఇలాంటి చికిత్స ఇప్పటి వరకు జపాన్‌లోనే నిర్వహించారని తెలిపారు. బ్లడ్‌ గ్రూప్‌నకు సరిపోని ఒక అవయవాన్ని, అదే బ్లడ్‌ గ్రూప్‌నకు సరిపోయే మరొక అవయవాన్ని ఉపయోగించి ఒకేసారి మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. టాంజానియా దేశానికి చెందిన గాబ్రియల్‌ సీజర్‌ సీసా అనే వ్యక్తి మూత్రపిండాలు, కాలేయ వ్యాధి చికిత్స కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు రోగికి లివర్‌ సిర్రోసిస్‌, మూత్రపిండాలు పాడైపోవడం అనే సమస్యలున్నట్లు తేల్చారు. 


అతడి భార్య నుంచి కాలేయం, మేనల్లుడి నుంచి కిడ్నీలు సేకరించి ఫిబ్రవరి 12న మూడు ఆపరేషన్‌ థియేటర్లలో ఒకేసారి కాలేయ, కిడ్నీ మార్పిడి చేశారు. దీనికి 23 గంటల సమయం పట్టిందని వైద్యులు చెప్పారు. అవయవ మార్పిడి జరిగిన నాలుగో రోజున మూత్రపిండాలను దానం చేసిన దాతను, ఆరో రోజున కాలేయ దాతను డిశ్చార్జి చేశారు. 16వ రోజున రోగిని ఇంటికి పంపించారు. బ్లడ్‌ గ్రూప్‌ సరిపోకపోవడం, రోగి డయాలసి్‌సపై ఉండడం, రెండు అవయాలను ఒకేసారి మార్పిడి చేయడం అత్యంత ప్రమాదకరమని అపోలో ఆస్పత్రి చీఫ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ మనీ్‌షశర్మ వివరించారు. ఈ శస్త్ర చికిత్స ప్రక్రియలో వైద్యులు మనీష్‌ శర్మ, డాక్టర్‌ రవి ఆండ్రూస్‌, సోమశేఖర్‌, నవీన్‌ పొలవరు, శశిధర్‌రెడ్డి, రాజశ్రీ, మంజునాథ్‌, నవకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T12:19:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising