ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంపన్న వాగులో ఇద్దరు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపుచర్యలు

ABN, First Publish Date - 2021-07-13T18:13:01+05:30

జంపన్న వాగులో పిడి గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడారం: జంపన్న వాగులో పిడి గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం స్నానం కోసం వాగులోకి దిగిన ఇద్దరు యువకులు శ్యామల్‌రావు, కోటేశ్వరరావు ప్రమాదవశాత్తు వాగులో మునిగి గల్లంతయ్యారు. వారి కోసం నిన్నటి నుంచి గాలిస్తున్నారు. వాగులో నీరు ఎక్కువగా ఉండడంతో వెతకడం కష్టతరమవుతోంది. గల్లంతైన ఇద్దరు యువకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరుకు చెందినవారిగా గుర్తించారు. మరి కాసేపట్లో గజఈతగాళ్లను రంగంలోకి దించనున్నారు.


ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్న వాగు వరద నీటిలో ఇద్దరు గల్లంతైన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పస్రా సీఐ అనుముల శ్రీనివాస్‌ తెలిపిన వివరాల మేరకు... మణుగూరు మండలం కొండాపూర్‌కు చెందిన బంగారి శ్యామల్‌రావు(24), ఉడిమడి కోటేశ్వరరావు(31) బంధుమిత్రులతో కలిసి వనదేవతల దర్శనానికి మేడారం వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. కోటేశ్వరావుకు భార్య మీనా, ఇద్దరు పిల్లలు ఉండగా శ్యామల్‌రావు అవివాహితుడని సీఐ తెలిపారు.  

Updated Date - 2021-07-13T18:13:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising