ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దపులి కనిపించింది

ABN, First Publish Date - 2021-11-21T06:26:31+05:30

పెద్దపులి కనిపించింది

మొట్లగూడెం జంగాలపల్లి గేట్‌ వద్ద రోడ్డు దాటుతున్న పెద్దపులి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టేకులపల్లి అటవీప్రాంతంలోకి ప్రవేశించిన పులి

మొట్లగూడెం జంగాలపల్లి గేట్‌వద్ద ప్రత్యక్షం

రోడ్డుదాటుతుండగా వీడియోతీసిన ఫారెస్టు సిబ్బంది

ధ్రువీకరించిన అటవీ అధికారులు

టేకులపల్లి, నవంబరు 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనిశెట్టిపల్లి-ఆళ్లపల్లి ప్రధాన రహదారిపై టేకులపల్లి మండలంలోని మొట్లగూడెం గ్రామ సమీపంలోని జంగాలపల్లి గేట్‌ వద్ద శనివారం తెల్లవారుజామున పెద్దపులి రోడ్డు దాటింది. పులి రోడ్డుదాటుతున్న దృశ్యాలను ఫారెస్టు సిబ్బంది వీడియో తీశారు. అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫారెస్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో టేకులపల్లి మండలంలోని మొట్లగూడెం అటవీప్రాంతంలో ఫారెస్టు సిబ్బంది పులి సంచారంపై నిఘావేశారు. శనివారం తెల్లవారు జామున 2.30గంటల సమయంలో పులి రోడ్డు దాటుతుండగా గమనించిన ఫారెస్టు సిబ్బంది వీడియోలో తీశారు. ఈ విషయం తెలుసుకొన్న కొత్తగూడెం ఎఫ్‌డీవో అప్పయ్య, టేకులపల్లి ఫారెస్టు రేంజ్‌ అధికారి ముక్తార్‌ హుస్సేన్‌లు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. పెద్దపులి రోడ్డుదాటి జంగాలపల్లి, మొర్లిపాడు బీటు అటవీప్రాంతాల వైపు వెళ్లినట్టు పాదముద్రలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్న వార్త తెలియగానే మండలంలోని అటవీ ప్రాంత గామాలైన జంగాలపల్లి, మొట్లగూడెం, సిద్దారం, ఆళ్లపల్లి మండలంలోని రాయపాడు గ్రామాల ప్రజలు భయాభ్రాంతులకు గురయ్యారు. 

అటవీప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలి

అప్పయ్య, కొత్తగూడెం ఎఫ్‌డీవో

పులి సంచరిస్తున్న నేపధ్యంలో గిరిజన గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలి. రాత్రి వేళల్లో పొలాలవద్దకు కాపలాకు వెళ్లవద్దు. అటవీ ప్రాంతానికి అసలు వెళ్లవద్దు. సాయంత్రం నాలుగు గంటలకే ఇళ్లకు చేరుకోవాలి. ఒకవేళ చేల వద్ద కాపలా ఉండటం తప్పనిసరైతే గుంపులుగా శబ్ధాలు  చేస్తూ మంచలపై ఉండాలి. పశువులను చేలవద్ద కట్టేయవద్దు. అడవీలో 10చోట్ల కెమెరాలను ఏర్పాటు చేశాం. వీటిసాయంతో పులి పులికదిలికలు, స్థితిగతులను అంచనావేస్తున్నాం. ప్రజలు సంయమనం పాటించాలి. విద్యుత్‌ ఇతర ప్రయోగాల ద్వారా పులిని చంపేందుకు ప్రయత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.



Updated Date - 2021-11-21T06:26:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising