ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీ కేసులో నిందితుల రిమాండ్‌

ABN, First Publish Date - 2021-06-09T04:26:39+05:30

మండల కేంద్రమైన బూర్గంపాలో ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. బూర్గంపాడుకు చెందిన నాగమణి అనే ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ.11,37,800 లను తస్కరించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ జితేందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బూర్గంపాడు, జూన్‌ 8: మండల కేంద్రమైన బూర్గంపాలో ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. బూర్గంపాడుకు చెందిన నాగమణి అనే ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ.11,37,800 లను తస్కరించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ జితేందర్‌ వివరాలు వెల్లడించారు. మంగళవారం గౌతపురం శివారులో ఎస్‌ఐ జితేందర్‌ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇరువురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించినట్లు తెలిపారు. దీంతో వారిని ఆదుపులోకి తీసుకుని విచారించగా బూర్గంపాడుకు చెందిన సందీప్‌, నవీన్‌కుమార్‌గా గుర్తించారు. పోలీసులు విచారించగా నాగమణి ఇంట్లో దొంగతనం చేసింది తామేనని దొంగతనానికి ఒప్పుకొన్నారు. దీంతో వారి వద్ద నుంచి రూ.6 ,60,700 రికవరీ చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి నింధుతులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆదనపు ఎసై ఖజా నసీరుద్దీన్‌, సిబ్బంది రాంబాబు, నరసింహరావు, రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-09T04:26:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising