ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆస్తులివే..

ABN, First Publish Date - 2021-11-25T05:43:56+05:30

స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున ్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. నామినేషన్ల సందర్భంగా వారు తమ ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఎవరికెన్ని ఆస్తులు, అప్పులు ఉన్నాయంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఫిడవిట్లలో పేర్కొన్న పోటీదారులు

ఖమ్మం కలెక్టరేట్‌, నవంబరు 24:  స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున ్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఆస్తుల  వివరాలను వెల్లడించారు. నామినేషన్ల సందర్భంగా వారు తమ ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఎవరికెన్ని ఆస్తులు, అప్పులు ఉన్నాయంటే..

టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి తాతా మధు

తాతామధుకు నెట్‌ క్యాష్‌గా రూ. 6లక్షలు, తన భార్యకు రూ.5లక్షలు మొత్తం తన పేరుతో బ్యాంకులో 79లక్షల 46,445 ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. నెస్టార్‌ ఇన్ర్ఫా ప్రాజెక్టులో డిపాజిట్లు రూ 35,66, 941, నెస్టార్‌ స్టోన క్రషర్స్‌లో రూ 21, 18,459, తన భార్య భవాని పేరుతో రూ.2కోట్ల 62లక్షల 50వేలు ఉన్నట్లు చూపించారు. మధు తన పేరుతో 10లక్షల 5వేల 291 ఎల్‌ఐసీ పాలసీ ఉన్నట్లు, ఆరోగ్య పాలసీ కింద రూ.80,045 ఉన్నాయి. తనకు ఇన్నోవా వాహనం, దాని ఖరీదు రూ 21లక్షలుగా ఉన్నట్లు చూపించారు. తన భార్యకు రూ.600 గ్రాముల బంగారం ఉందని దాని ఖరీదు రూ.30లక్షలుగా చూపించారు. మొత్తంగా తన పేరుతో రూ.1కోటి 74లక్షల 17,181, తన భార్య భవాని పేరుతో రూ.2కోట్ల 97లక్షల 50వేలు చరాస్థులు ఉన్నట్లు చూపించారు.  స్థిరాస్తి విషయాల కొస్తే తన పేరుతో పిండిపోలు, పోలేపల్లి గ్రామంలో 6ఎకరాలు, ఒక ఎకరం ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. వీటి విలువ ప్రస్తుతం (మార్కెట్‌ వాల్యు ప్రకారం) 6ఎకరాలు రూ.1కోటి 50లక్షలు, ఒక ఎకరం రూ.20లక్షలు ఉన్నట్లు చూపించారు. నివేశన స్థలాలుగా తొమ్మిది ప్లాట్లు ఉన్నట్లు చూపించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.8 కోట్ల 57లక్షల 37వేల 765 ఉన్నట్లు చూపించారు. హైదరాబాద్‌లో హకీంపేటలో మూడు ఫ్లోర్ల భవనం, దాని ఖరీదు రూ.1కోటి 46, 67,860 ఉన్నట్లు, ఖమ్మంలో విజయనగర్‌ కాలనీలో తాతా రెసిడె న్సీ పేరుతో రెండు ప్లాట్లు, అమెరికాలో ఒక ప్లాటు ఉన్నట్లు చూపించారు. ఖమ్మంలో ఆపార్ట్‌మెంట్‌ ఖరీదు ఒకటి రూ. 40లక్షలు, మరొకటి కోటి రూపాయలు, అమెరికాలో ప్లాటు ఖరీదు రూ.3కోట్ల 75లక్షలు ఉంటుందని అఫిడవిట్‌లో చూపించారు. మొత్తం వీటి విలువ రూ.16కోట్ల 89లక్షల 5,625 ఉన్నట్లు ఎన్నికల సంఘానికి నివేదించారు. తనకు బ్యాంకుల్లో అమెరికాలో, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాలో మొత్తంగా రూ.2కోట్ల 99లక్షల 49వేలు అప్పులు ఉన్నట్లు తన అఫిడవిట్‌లో చూపించారు. తనపై ఎలాంటి కేసులు, క్రిమినల్‌ కేసులు లేవని పేర్కొన్నారు.

రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి

 తన పేరుతో బ్యాంకులో నగదుగా రూ.1లక్ష 80వేల 450, తన భార్య పద్మపేరుతో రై.1లక్ష 50వేల 300లు, తన భాగస్థుల పేరుతో రూ.1లక్ష 75వేలు నగదు డబ్బు ఉందని అఫిడవిట్‌లో చూపించారు. గణేష్‌ గ్రానైట్‌లో రూ.4లక్షల 31,380, తన భార్య పేరుతో గణేష్‌ గ్రానైట్‌లో రూ.28లక్షల 4వేల 716 పెట్టుబడులు ఉన్నట్లు చెప్పారు. విజయసాయి గ్రానైట్స్‌లో రూ.27లక్షల 67వేల312, తన భార్యపేరుతో రూ.8లక్షల 36వేల 701, సాయిలీలా గ్రానైట్స్‌ ఇండస్ర్టీలో రూ.76లక్షల 07,483 తన భార్యపేరుతో ఎస్వీవీలో రూ. 50లక్షల 14,208 పెట్టుబడులున్నట్లు చూపించారు. శ్రీమంతరాక్‌సలో రూ.1కోటి 21లక్షల 72, 345, తన భార్యపేరుతో సాయిలీలా గ్రానైట్స్‌ లో రూ.16లక్షల 75వేల 301 పెట్టుబడులున్నట్లు చూపించారు. తనకు రూ.3లక్షల 50వేల విలువైన బంగారం, తన భార్య పద్మకు రూ. 8లక్షల 50వేల విలువైన బంగారు వస్తువులున్నట్లు చూపించారు. మొత్తంగా వీటి విలువ చర ఆస్తులు రూ. 2కోట్ల 35లక్షల 96వేల 408, తన భార్యపేరుతో రూ.1కోటి 13లక్షల 40వేల 776 లున్నట్లు చూపించారు. స్థిరాస్థుల కింద వ్యవసాయ భూమి తన పేరుతో ముదిగొండ మండలం వెంకటాపురంలో 11ఎకరాల 095 గుంటలు, మరో చోట 1ఎకరం 37 గుంటలు వీటి విలువ రూ.50లక్షలు ఉంటుందని తన భార్యపేరుతో 3 ఎకరాల 20 గుంటల భూమి దాని విలువ రూ 10లక్షల 50వేలు ఉన్నట్లు చూపించారు. నివాస స్థలాలుగా తనపేరుతో బుర్హానపురంలో 234 గజాలు, పాకబండ బజారులో 339.805 గజాల స్థలం ఉందని వీటి విలువ ప్రస్తుతం రూ 61లక్షల 43వేలు ఉంటుందన్నారు. తన భార్యపేరుతో పాకబండ బజార్‌లో 240 గజాల స్థలం ఉందని దాని ఖరీదు ప్రస్తుతం రూ 16లక్షలు ఉంటుందని చూపించారు. తన భార్య పద్మపేరుతో బుర్హానపురం బస్‌డిపో సమీపంలో కమర్షియల్‌ భవనం ఉందని దీని విలువ ప్రస్తుతం రూ.1కోటి 43లక్షల 30వేలు విలువ ఉంటుందని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరుతో బుర్హానపురంలో సుకృతి ఏవిస్‌ పేరుతో నివాస భవనం ఉందని దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని వివరించారు. మొత్తంగా తన పేరుతో స్థిరాస్థుల కింద రూ.2కోట్ల 11లక్షల 43వేలు, తన భార్యపేరుతో రూ.1కోటి 69లక్షల 80వేలు ఉన్నట్లు, తన పేరుతో బ్యాంకుల్లో రూ. 21లక్షల 58వేలు రుణాలు ఉన్నట్లు తన అఫిడవిట్‌లో ఎన్నికల సంఘానికి నివేధించారు. తనపై ఎలాంటి క్రిమినల్‌, కేసులు లేవని నివేదించారు.

కొండపల్లి శ్రీనివాసరావు, స్వతంత్య్ర అభ్యర్థి

బ్యాంకు ఖాతాలో నగదుగా రూ. లక్ష ఉన్నాయని చూపించారు. తనపేరుతో రూ.1లక్ష 50వేల విలువైన బుల్లెట్‌ మోటార్‌సైకిల్‌, రూ.22లక్షల విలువైన హారియర్‌ కారు ఉందని చూపించారు. తన పేరుతో 5తులాల బంగారు వస్తువులు 50తులాల వెండి ఉన్నట్లు చూపించారు. మొత్తంగా రూ.28లక్షల విలవులైన ఆస్థి ఉన్నట్లు చూపించారు. స్థిరాస్తుల రూపంలో కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో 17ఎకరాల 34గుంటల వ్యవసాయభూమి ఉందని మరో 6ఎకరాలు తాను కొనుగోలు చేశానని వాటి విలువ ఎకరం రూ.8లక్షలు ఉంటుందని అఫిడవిట్‌లో తెలిపారు. వ్యవసాయేతర భూములుగా పేరువంచ గ్రామంలో, ఖమ్మం రూరల్‌ మండలం గుర్రాలపాడు గ్రామం, పెద్దతండా గ్రామంలో ఎంవెంకటాయపాలెం గ్రామంలో, వెంకటగిరి గ్రామపంచాయతీలో ఇళ్ల స్థలాలు ఉన్నాయని వాటి విలువ రూ.75లక్షలు ఉంటుందని వివరించారు. కమర్షియల్‌ భవనాలు పేరువంచలో రూ.15లక్షల విలువైన భవనం ఉందని, తన పేరుతో ప్రస్తుతం లక్ష్మీ విలాస్‌బ్యాంకులో 13లక్షలు, కర్ణాటక బ్యాంకులో రూ 60లక్షల మార్టిగేజ్‌ రుణాలు ఉన్నాయని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

 కొండూరి సుధారాణి, స్వతంత్య్ర అభ్యర్థి

మరో స్వతంత్య్ర అభ్యర్థి కొండూరి సుధారాని తన బ్యాంకు ఖాతాలో రూ.15లక్షల 764,వేలు, తన భర్త పేరుతో రూ. 24వేలు ఉన్నట్లు చూపించారు. తన పేరుతో కానీ తన భర్తపేరుతో కానీ చరస్థిర ఆస్తులేవీ లేవంటూ అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-25T05:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising