ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను మోసం చేస్తే సహించేది లేదు: రైతుసంఘం

ABN, First Publish Date - 2021-11-27T04:52:06+05:30

రుణమాఫీ, గిట్టుబాటు ధర హామీలను అమలుచేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతుసంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొండపర్తి గోవిందరావు విమర్శించారు.

మహాసభలో మాట్లాడుతున్న గోవిందరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధిర రూరల్‌, నవంబరు 26: రుణమాఫీ, గిట్టుబాటు ధర హామీలను అమలుచేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతుసంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొండపర్తి గోవిందరావు విమర్శించారు. శుక్రవారం మధిర మునిసిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలోని సీపీఐ కార్యాలయంలో అమరజీవి కామ్రేడ్‌ మందడపు నాగేశ్వరరావు ప్రాంగణంలో తెలంగాణ రైతుసంఘం 16 మండల మహాసభ శేషగిరిరావు అధ్యక్షతన జరిగింది. రైతుసంఘం జెండాను జాతీయ నాయకురాలు మందడపు రాణి ఎగురవేశారు. గోవిందరావు మాట్లాడుతూ రైతులను మోసం చేసేందుకు దళారీ వ్యవస్థను సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీలు మూకుమ్మడిగా పెంచి పోషిస్తున్నారని దీన్ని ప్రతిఘటించేందుకు రైతులు సమరభేరికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శులు దొండపాటి రమేష్‌, జక్కుల రామారావు, వ్య.కా.సం జిల్లా అధ్యక్షుడు పగిడిపల్లి ఏసు, సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు వూట్ల కొండలరావు, బెజవాడ రవిబాబు, సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి ప్రకాశరావు, చావా మురళీకృష్ణ, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T04:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising