అక్షరానికి కులంలేదు: గద్దర్
ABN, First Publish Date - 2021-09-29T05:17:03+05:30
అక్షరానికి కులం లేదని ప్రముఖ ప్రజావగ్గేయకారుడు గద్దర్ అభిప్రాయపడ్డారు.
ఖమ్మం ఖానాపురంహవేలి సెప్టెంబరు 28: అక్షరానికి కులం లేదని ప్రముఖ ప్రజావగ్గేయకారుడు గద్దర్ అభిప్రాయపడ్డారు. మంగళ వారం మహాకవి గుర్రం జాషువా 126వ జయంతి సందర్భంగా జాషువా సాహిత్యవేదిక ఎస్‌ఆర్ బీజీఎన్‌ఆర్ కళాశాల తెలుగు విభాగం సంయుక్తంగా అంతర్జాల సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జాకీరుల్లా అధ్యక్షతన పంచస్వరాలు ప్రజావాగ్గేయకారులు ప్రత్యేక కార్యక్రమంలో గౌరవ అతిథిగా గద్దర్ పాల్గొన్నారు. జాషువాను చదవడమంటే నాలాంటి అణగారిన జీవితాల గురించి చదువుతున్నట్లు ఉందన్నారు. ప్రముఖ వాగ్గేయకారులు ఎం.ఎల్.సి గోరేటి వెంకన్న, రసమయి బాలకిషన్, ముఖ్యమంత్రి ఓ.ఎస్.డి. దేశపతి శ్రీనివాస్, విమలక్క,జాషువ భావనాశక్తిని, ప్రతిఘటనా చైతన్యాన్ని తమ విలక్షణ స్వరాలతో రాగయుక్తంగా విశ్లేషించారు. కార్యక్రమంలో జాషువ సాహిత్యవేదిక అధ్యక్షుడు మువ్వాశ్రీనివాసరావు, కార్యదర్శి పగిడిపల్లి వెంకటేశ్వర్లు, సమన్వయకర్త కోటేశ్వరరావు, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రవికుమార్, పూర్ణచందర్‌రావు, ఎం.వి. రమణ లతోపాటు వివిధ ప్రాంతాల కవులు,విమర్శకులు, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-29T05:17:03+05:30 IST