ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ట్రెసా’ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కారుమంచి

ABN, First Publish Date - 2021-11-22T06:00:45+05:30

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన కారుమంచి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌, నవబరు 21: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన కారుమంచి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కోశాధికారిగా బొగ్గవరపు వెంకటేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ట్రెసా  కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా వంగా రవీందర్‌రెడ్డి, గౌతం కుమార్‌తో పాటు ఉపాధ్యక్షునిగా కారుమంచి శ్రీనివాసరావుకు స్థానం దక్కింది. కారుమంచి శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు, ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు ప్రాధాన్యతను కల్పించడంతో ట్రెసా జిల్లా అధ్యక్షుడు తుంబూరు సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వాన్ని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దొడ్డె పుల్లయ్య, కోశాధికారి మిరియాల క్రాంతికుమార్‌, కార్యవర్గ సభ్యులు సిహెచ్‌ సత్యనారాయణ, కేవీవీ ప్రసాద్‌, దాసరి రవికుమార్‌, తుమ్మ రవీందర్‌, దారా ప్రసాద్‌, సాయి నరేష్‌, చిలకబత్తిని రమేష్‌, ఎం శ్రీను, రేసు వీరయ్య, శ్యాంసింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-22T06:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising