ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనదారులకు సన్మానం.. పెట్రోధరలపై ఖమ్మం టీడీపీ నేతల వినూత్న నిరసన

ABN, First Publish Date - 2021-06-18T05:33:51+05:30

పెట్రోధరలు భగ్గుమంటున్న వేళ ఖమ్మం టీడీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఈ ధరల భారాన్ని మోస్తున్న వాహనదారులూ... గ్రేట్‌ అంటూ బంకుల వద్దకు వచ్చిన వాహన దారులను సత్కరించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఖమ్మం పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్‌, నాయకుడు కొండబాల కరుణాకర్‌ ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని పెట్రోల్‌ బంకు ఎదుట ధర్నా చేశారు.

ఆటోడ్రైవర్‌ను సత్కరిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం మామిళ్లగూడెం, జూన్‌ 17: పెట్రోధరలు భగ్గుమంటున్న వేళ ఖమ్మం టీడీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఈ ధరల భారాన్ని మోస్తున్న వాహనదారులూ... గ్రేట్‌ అంటూ బంకుల వద్దకు వచ్చిన వాహన దారులను సత్కరించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఖమ్మం పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్‌, నాయకుడు కొండబాల కరుణాకర్‌ ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని పెట్రోల్‌ బంకు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా డీజిల్‌, పెట్రోల్‌ పోయించుకునేందుకు బంకుకు వచ్చిన ఆటోడ్రైవర్లు, ద్విచక్రవాహనదారులు పలువురికి శాలువాలు, పూల దండలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోధరలను పెంచుతుంటే మూగగా వాటిని భరిస్తున్న ప్రజలు ఎంతో గొప్పవాళ్లని, ఓ వైపు కరోనాతో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే సామాన్యుల గోడును పట్టించుకోవడం లేదని మండిపోతున్నారు. ఈ క్రమంలో తాము నష్టపోతున్నా.. ప్రభుత్వాలకు మాత్రం లాభం చేకూర్చుతున్న వాహనదారులను సన్మానించి తమ నిరసనను వినూత్నంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ ఆందోళనలో నాయకులు తోటకూర శివయ్య, చేతుల నాగేశ్వరరావు, వక్కంతుల వంశీ, కాంపాటి విజయ్‌, తెలుగు మహిళా నగర అధ్యక్షుడు చుండూరు రాజ రాజేశ్వరి, మునగపాటి సంపత్‌, పాలడుగు కృష్ణప్రసాద్‌, చండ్ర రవి, నాగండ ్ల లక్ష్మణ్‌, చావ రామారావు, వాసిరెడ్డి భాస్కరరావు, ఎర్నం జేమ్స్‌, బత్తుల రవి, కూచిపూడి జై చౌదరి, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుల నిరసనకు వాహనదారులు మద్దతు పలికి.. ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు.


Updated Date - 2021-06-18T05:33:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising