ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్‌

ABN, First Publish Date - 2021-06-18T05:14:34+05:30

ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దారు కారుమంచి శ్రీనివా్‌సరావు హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం రూరల్‌, జూన్‌ 17: ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దారు కారుమంచి శ్రీనివా్‌సరావు హెచ్చరించారు. మండల పరిదిలోని పెద్దతండాలోని 142 సర్వే నంబర్‌లోని అసైన్‌మెంట్‌ భూమిని కొంత మంది ఆక్రమించి ప్లాట్లు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో గురువారం ఆ భూమిని తహసీల్దారు సందర్శించారు. భూమి హద్దులను ,రికార్డులను పరిశీలించారు. అసైన్‌మెంట్‌ భూమిని అమ్మడానికి, కొనడానికి వీలు లేదన్నారు. అమ్మినా,కొనుగోలు చేసినా నేరం అవుతుందన్నారు. రహదారుల పక్కనే ఉన్న ప్రభుత్వ భూములు చాలా విలువైనవని వాటిని ఆక్రమించాలని చూస్తే శిక్షార్హులవుతారన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు నివేదికను అందజేసి చట్టప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ నరేశ్‌, సర్వేయర్‌ వెంకట్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-06-18T05:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising