ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైకుంఠధామం స్థలం ఆక్రమణపై సర్వే

ABN, First Publish Date - 2021-07-25T05:05:05+05:30

మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామంలోని తమ్మలచెరువుసమీపాన గల వైకుంఠధామం స్థలం ఆక్రమణకు గురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లూరు,జూలై 24: మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామంలోని తమ్మలచెరువుసమీపాన గల వైకుంఠధామం స్థలం ఆక్రమణకు గురైంది. గతంలో ఈస్థలాన్ని అదే గ్రామానికి చెందిన సోమరాజు వెంకటసూర్యనారయణరావు, వెంకటరాఘవేంద్రరావు  ప్రజల అవసరాల నిమిత్తం దానం చేశారు.సోమరాజు కుటుంబంపేరునగల సర్వేనెంబర్‌ 99/ఇ/రూ/అ ప్రకారం 20 కుంటల స్థలాన్ని 55సంవత్సరాల క్రింతం సదరు వైకుంఠదామానికి వితరణ చేశారు. దాతలు సోమరాజు కుటుంబం తరుపున ఎవరు స్థానికంగా అందుబాటులో లేనందున ఈస్థలంపై కొంతమంది కన్ను పడింది. దీంతో స్థానిక సర్పంచు గోల్లమందల ప్రసాద్‌తో, పాటుగా మరో కొంతమంది పేదలు కరీంనగర్‌లో వున్నపోలీసు ఉన్నత అఽధికారి స్థల దాత రాఘవేంద్రరావును ఇటివల నేరుగా కలిసి వాస్తవ పరిస్థితిని వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. చండ్రుపట్ల గ్రామంలో తమ పేరున పట్టా గల సర్వేనెంబర్లు99/ఇ/రూ/అ.మరో సర్వేనెంబర్‌ 355/1/అ/అ.ప్రకారం వేర్వేరు ప్రదేశాల్లో పలు సామాజిక వర్గాల వారికి రెండుచోట్ల 40 కుంటల స్థలాన్ని  వితరణ చేశామని దాత రాఘవేంద్రరావు ఇటివల జిల్లా, మండల రెవెన్యూ అధికారులను అశ్రయించారు. దీంతో స్పందించిన తహాసీల్దార్‌ మంగీలాల్‌, అక్రమణలకు గురైన వైకుంఠధామం స్థలాలపై సర్వేకు అదేశించారు దీంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వరరావు, సర్వేయిర్‌ లక్ష్మికూమారి సదరు స్థలంపై శనివారం ముందుగా ఆ స్థలలా హాద్దులను పరిశీలించి సర్వే చేపట్టారు. సర్వే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ చెప్పారు.


Updated Date - 2021-07-25T05:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising