మతోన్మాదం దేశానికి ప్రమాదకరం
ABN, First Publish Date - 2021-12-16T05:20:02+05:30
దేశానికి మతోన్మాదం ఎంతో ప్రమాదకరమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. మతోన్మాద చర్యలతో సమాజం ఐక్యతకు విఘాతం కలుగుతుందన్నారు.
మార్క్సిజానికి ప్రత్యామ్నాయం లేదు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
ముగిసిన పార్టీ ఉమ్మడి జిల్లా స్థాయి శిక్షణ
ఖమ్మంసంక్షేమవిభాగం, డిసెంబరు 15: దేశానికి మతోన్మాదం ఎంతో ప్రమాదకరమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. మతోన్మాద చర్యలతో సమాజం ఐక్యతకు విఘాతం కలుగుతుందన్నారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కౌన్సిల్ శిక్షణా తరగతుల్లో రెండో రోజు ఆయన ప్రసంగించారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అనే అంశంపై ఆయన శిక్షణ ఇచ్చారు. దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీలకు ప్రత్యేకమైన బలం ఉందన్నారు. దానిని ఓట్లు, సీట్లతో కొలవలేమని వివరిం చారు. కమ్యూనిస్టు పార్టీలు బలహీనంగా కనిపించినా బలమైన పునాదులు ఉంటాయని తెలిపారు. రాజకీయ పార్టీలకు ఒడదోడుకులు సహాజమే అని భవిష్యత్‌లో కమ్యూనిస్టు పార్టీలే ప్రజలకు అండగా ఉంటాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్క్సిజానికి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ అంత మెందే వరకు మార్క్సిజం సజీవంగా ఉంటుందన్నారు. తరగతులు ముగింపు సందర్భంగా ప్రముఖ ఆంశాలను ఫ్రోఫెసర్ యుగల్ రాయ, నాయకులు యూసుప్, బాగం హేమంతరావు, జితేందర్‌రెడ్డి బోదించారు.
Updated Date - 2021-12-16T05:20:02+05:30 IST