ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ కష్టాలు.. యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-01-11T04:59:58+05:30

లాక్‌డౌన్‌ కావడంతో అప్పులు చేసి తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం నగరంలో ఆదివారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మంక్రైం, జనవరి 10: లాక్‌డౌన్‌ కావడంతో అప్పులు చేసి తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం నగరంలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం కొత్తపేటకు చెందిన అనిల్‌కుమార్‌ (29) బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం హైదరాబాదులోని సూరారం కాలనీలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ద్విచక్రవాహనషోరూంలో పనిచేస్తూ జీవిస్తున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన ఉద్యోగం పోయింది. డ్రైవింగ్‌ చేసి జీవిద్దామని ఓకారు అద్దెకుతీసుకుందామన్న కారు కొందామంటే డబ్బు దొరకలేదు. దీంతో స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. దీంతో తీవ్ర వేదనకు గురైన అనిల్‌కుమార్‌ నవంబరు 23న ఇంటిలో ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేశాడు. తన ఫోన్‌స్విచాప్‌ చేసుకుని డిసెంబరు 30న ఖమ్మం వచ్చి బస్టాండ్‌ సమీపంలోని లాడ్జిలో ఉంటున్నాడు. తన ఆచూకీ లభించకపోవడంతో కటుంబసభ్యులు హైదరాబాదులోని దిండిగల్‌ పోలీసేస్టషన్‌లో ఫిర్యాదుచేశారు అయితే కొద్దిరోజులుగా ఖమ్మంలో ఉంటున్న అనిల్‌కు మార్‌ ఆదివారం తలుపులు తీయకపోవడం తో అనుమానం వచ్చినలాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి తెరిచారు. వారు చూడగా అనిల్‌కుమార్‌ ఫ్యాన్‌ కు ఉరేసుకుని ఉన్నాడు. పోలీసులు అన్నం శ్రీనివాసరావు సహాయంతో మృతదేహాన్ని మార్చురికి తరలించి మృతుని వద్దఉన్న ఆధారాలతో కుటుంబ భ్యులకు సమాచారం అందించారు. 


Updated Date - 2021-01-11T04:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising