ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం: నామ

ABN, First Publish Date - 2021-01-19T05:27:33+05:30

రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శమని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు.

అంబులెన్స్‌ సేవలను ప్రారంభిస్తున్న ఎంపీ నామ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూలూరుపాడు, జనవరి18: రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శమని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ముందుగా జూలూరుపాడు మండంలో ప్రధానమంత్రి సడక్‌ యోజన పథకం కింద మంజూరైన రూ.4.18 కోట్ల నిధులతో కొమ్ముగూడెం నుంచి గోపాతండా మీదుగా అనంతారం వరకు చేపడుతున్న బీటీ రహదారి నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నామ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన ఏడు సంవత్సరాలలో రాష్ట్రం అభివృద్ది చెందిదని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్‌లో తానే తొలి ఓటు వేశారని అన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ పాటు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, పంచాయతీ రాజ్‌ ఈఈ సుధాకర్‌, ఎంపీడీవో రామారావు, పీఆర్‌ మండల ఏఈ శివలాల్‌, ఎంపీపీ లావుడ్యా సోనీ, సొసైటీ చైర్మన్‌ లేళ్ళ వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, సర్పంచ్‌ బి.శాంతీలాల్‌, ఎంపిటీసీ సక్కుబాయి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు, నాయకులు పిజి .కృష్ణమూర్తి, నర్వనేని పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

రఘపతిరెడ్డికి నివాళులు

అన్నపురెడ్డిపల్లి, జనవరి 18: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమ నేత బండి రఘుపతి రెడ్డి పార్టీకి చేసిన సేవలు మరువలేనివి అని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. సోమవారం రాజాపురంలో బండి రఘుపతిరెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించి రఘుపతిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట జిల్లాపరిషత్‌ చైర్మన్‌ కొరం కనకయ్య, ఆశ్వారావుపేట మాజి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రావు, మండల రైతుబంధు కో-ఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ లాలమ్మ, మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. 

అంబులెన్స్‌ సేవలను ప్రారంభించిన ఎంపీ నామ

అశ్వారావుపేట రూరల్‌, జనవరి 18: అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ సేవలను ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఎంపీ నామా తన స్వంత నిధులతో ఆరు అంబులెన్స్‌లను కొనుగోలు చేసి జిల్లాలోని ఆసుపత్రులకు అందించారు. అశ్వారావుపేటకు అందించిన అంబులెన్స్‌ను స్థానిక సామాజిక ఆసుపత్రిలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

బాధితులకు అండగా ఉంటా 

చంద్రుగొండ, జనవరి18: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని, అన్ని విధాలుగా పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. సోమవారం మద్దుకూరు, చంద్రుగొండ, తిప్పనపల్లి గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను పరామర్శించి, అండగా ఉంటామన్నారు. అదేవిధ ంగా పలు శుభకార్యాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, అశ్వారావుపేట టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆదినారాయణ టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భోజ్యానాయక్‌, ఎంపీపీ బాణోత్‌ పార్వతి, వైస్‌ఎంపీపీ సత్యనారాయణ, జిల్లా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ రసూల్‌, గానుగపాడు సొసైటీ చైర్మన్‌ చందర్‌రావు, గుంపెన సొసైటీ అఽధ్యక్షుడు సుధాకర్‌రావు, వైస్‌ చైర్మన్‌ వెంకటనారాయణ, సారేపల్లి శేఖర్‌, ఏడుకొండలు, లింగయ్య, విజయలక్ష్మీ, సరళ, రమేష్‌, శ్రీనివాసరావు, గుగుళోత్‌ రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T05:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising