ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

ABN, First Publish Date - 2021-11-22T04:42:39+05:30

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, యువత వ్యసనాల జోలికి పోకుండా ఆటలపై దృష్టి సారించాలని ఏఎస్పీ శబరీష్‌ అన్నారు.

టోర్నీ ముగింపు సభలో మాట్లాడుతున్న ఏఎస్పీ శబరీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువత దృష్టి సారిస్తే ప్రత్యేక గుర్తింపు

మణుగూరు ఏఎస్పీ శబరీష్‌

ముగిసిన వాలీబాల్‌ టోర్నీ

మణుగూరుటౌన్‌, నవంబరు 21: క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, యువత వ్యసనాల జోలికి పోకుండా ఆటలపై దృష్టి సారించాలని ఏఎస్పీ శబరీష్‌ అన్నారు. మణుగూరు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన మండల స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ ముగింపునకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టోర్నమెంట్‌ విజేత పగిడేరు జట్టు, ద్వితీయ స్థానం సాధించిన కూనవరం జట్ల క్రీడాకారులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించి బహుమతులు అందజేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా వలస ఆదివాసీ గ్రామ క్రీడాకారులకు నిర్వహించిన పోటీల్లో  ప్రఽథమ స్థానంలో నిలిచిన రేగులగండి, ద్వితీయ స్థానంలో నిలిచిన విప్పలగుంపు జట్లకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో నైపుణ్యం పెంచుకున్న వారికి గుర్తింపు, గౌరవంతోపాటు క్రీడా కోట కింద ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో నైపుణ్యం ప్రదర్శించిన క్రీఢాకారులకు పోత్సాహక బహమతులు అందజేశారు. కార్యక్రమంలో సీఐ ముత్యం రమేష్‌, ఎస్‌ఐలు పురుషోత్తం, నరేష్‌, సిబ్బంది పాల్గొన్నార

Updated Date - 2021-11-22T04:42:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising