ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి

ABN, First Publish Date - 2021-02-25T03:39:02+05:30

వివిధ స మస్యలతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్ర వర్తిస్తూ.... పోలీసులపై మరింత నమ్మకాన్ని పెంపొందించేలా బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ సునీల్‌ దత్‌ పోలీసు అధికారు లను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులను ఆదేశించిన ఎస్పీ సునీల్‌ దత్‌

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, ఫిబ్రవరి 24: వివిధ స మస్యలతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్ర వర్తిస్తూ.... పోలీసులపై మరింత నమ్మకాన్ని పెంపొందించేలా బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ సునీల్‌ దత్‌ పోలీసు అధికారు లను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేసి పట్టుబడిన వ్యక్తుల లైసెన్సులను రద్దుచేయించే విధంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సూచించారు. పోలీసు కేసుల్లోని వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలని అధికారులకు సూచించారు. బుధవారం తన ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాలులో పోలీసు అధికారులతో నేర సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.... పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యా యాధికారులతో సమన్వయం చేస్తూ ప్రతి ఒక్కరూ బాధ్య తగా కృషిచేయాలని కోరారు. నేరస్తులకు శిక్షలు పడే విధంగా చేసే శిక్ష రేటును పెంచాలన్నారు. చిన్న చిన్న నేరాలకు పా ల్పడే వారిపై ఈ-పెట్టీ కేసులు నమోదు చేయాలన్నారు. ఈ-చలానా ద్వారా రోడ్డు భద్రతా నియమాలను అతిక్రమిం చిన వారికి జరిమానాలు విధించాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి నేరాలను అదుపుచేసే విధంగా పని చేయాలన్నారు. గుట్కా, మట్కా, ఇతర అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఏర్పాటుచేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులకు సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దొంగతనాల కేసుల్లో నిందితులను పట్టుకొని చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేకూరే విధంగా పోలీస్‌ శాఖలో ఉన్న సాంకేతికతను వినియోగించుకోవాలని ఎస్పీ వారికి సూచించారు. సైబర్‌ క్రైమ్స్‌ బారిన పడకుండా జిల్లా ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని కోరారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో సైబర్‌ క్రైమ్స్‌ను ఛేదించడానికి సైబర్‌ వారియర్స్‌ను సిద్ధం చేయాలని సూచించారు. కేసుల పరిష్కారంలో ముందుండాలని ఆయన కోరారు. 


Updated Date - 2021-02-25T03:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising