ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్మీ ఎంపికలకు సింగరేణి శిక్షణ శిబిరాలు

ABN, First Publish Date - 2021-01-17T05:13:33+05:30

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ విభాగం (సికింద్రాబాద్‌)వారు మార్చి 5వ తేదీ నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం సింగరేణి ప్రాంతంలోని ఆసక్తిగల సింగరేణి యువతకు ఈ ర్యాలీ ద్వారా ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రి-ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ శిబిరాలను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్ని ఏరియాల్లో 11 చోట్ల ఏర్పాట్లు

550 మందికి 45 రోజులపాటు ఉచిత శిక్షణ

 కొత్తగూడెం, జనవరి 16: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ విభాగం (సికింద్రాబాద్‌)వారు మార్చి 5వ తేదీ నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం సింగరేణి ప్రాంతంలోని ఆసక్తిగల సింగరేణి యువతకు ఈ ర్యాలీ ద్వారా ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రి-ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ శిబిరాలను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. సీ అండ్‌ ఎండీ ఎన్‌. శ్రీధర్‌ ఆదేశాల మేరకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా గల 11 ఏరియాల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలను నిర్వహించబోతున్నారు. ఆర్మీపై ఆసక్తిగల సింగరేణి కార్మికుల బిడ్డలు, మాజీ కార్మికుల పిల్లలు, ప్రాజెక్ట్‌ ప్రభావిత కుటుంబాల, సమీప గ్రామాలు, కోల్‌బెల్ట్‌ ఏరియాలకు చెందిన యువకులు ఎవరైనా సరే ఈ ప్రి-ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ శిబిరంలో పాల్గొని శిక్షణ పొందవచ్చని సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షుడు జనరల్‌ మేనేజర్‌ (కో-ఆర్డినేషన్‌, మార్కెటింగ్‌) కే. రవిశంకర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏరియా నుంచి 50 మందిని ఎంపిక చేసి వారికి 45రోజుల పాటు శిక్షణను ఇవ్వనున్నారిన వెల్లడించారు.  

శిక్షణ కేంద్రాలు..

భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, పెద్దపల్లి జిల్లాలో రామగుండం-1 (గోదావరిఖని), రామగుండం-2 (8వ ఇంక్లైన్‌ కాలనీ), రామగుండం-3 (సెంటినరీ కాలనీ)లలో, మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్‌లో, కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ క్యాంపుల్లో చేర్చుకునేందుకు ప్రతి ఏరియాలో 20వ తేదీలోపు ప్రాథమిక ఎంపిక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత శిక్షణకు సంబంధించి మరిన్ని వివరాలు ఆయా జీఎం కార్యాలయాల్లో పర్సనల్‌ విభాగంలో సంప్రదించవచ్చని సింగరేణి అధికారులు తెలిపారు.  


Updated Date - 2021-01-17T05:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising