ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలానాలు చెల్లించని వాహనాల సీజ్‌: ఏసీపీ

ABN, First Publish Date - 2021-10-20T05:04:05+05:30

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసుశాఖ విధించిన జరిమానా చలానాలను చెల్లించని వాహనాలను సీజ్‌ చేయాలని వైరా ఏసీపీ స్నేహా మెహ్రా ఆదేశించారు.

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లాడ, అక్టోబరు 19: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసుశాఖ విధించిన జరిమానా చలానాలను చెల్లించని వాహనాలను సీజ్‌ చేయాలని వైరా ఏసీపీ స్నేహా మెహ్రా ఆదేశించారు. మంగళవారం రాత్రి తల్లాడలోని రాష్ట్రీయ ప్రధాన రహదారుల్లో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ సార్లు జరిమానా విధించబడినప్పటికీ ఇందుకు సంబంధించిన చలానాలను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి వాహనాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హెల్మెట్‌ ధరించకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులయ్యేవారిని ఉపేక్షించవద్దన్నారు. ఏసీపీ తక్షణ ఆదేశాల మేరకు తల్లాడ ఎస్‌ఐ జి.నరేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు అప్పటికప్పుడు చలానాలు చెల్లించకుండా ఉన్న వాహనాలను సీజ్‌చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో వైరా సీఐ జె.వసంతకుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T05:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising