ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య పనులు చేపట్టండి .. కొత్తగూడెం డీఈవో సోమశేఖర శర్మ

ABN, First Publish Date - 2021-01-18T04:53:54+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో గల 322 ఉన్నత పాఠశాలల్లో 9.10 తరగతులు ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభం కానున్న నేపధ్యంలో కలెక్టర్‌ ఆదేశానుసారం అన్ని పాఠశాలల్లో శాని టేషన్‌ పనులు చేపట్టడంతోపాటు కొవిడ్‌ నిబంధనలకు అ నుగుణంగా తగు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖా ధికారి సోమశేఖర్‌ శర్మ ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి 17: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో గల 322 ఉన్నత పాఠశాలల్లో 9.10 తరగతులు ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభం కానున్న నేపధ్యంలో కలెక్టర్‌ ఆదేశానుసారం అన్ని పాఠశాలల్లో శాని టేషన్‌ పనులు చేపట్టడంతోపాటు కొవిడ్‌ నిబంధనలకు అ నుగుణంగా తగు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖా ధికారి సోమశేఖర్‌ శర్మ ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఆదివారం ఆయన జిల్లాలోని ప్రవేటు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, ప్రిన్సిపాళ్లతో జూమ్‌ ద్వారా అవగాహాన కల్పించారు. పాఠశాల తెరవడానికి ముందే నిబంధనలకు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. భారత ప్రభుత్వ హోమ్‌ మంత్రిత్వశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జారీ చేసిన యస్‌ఓపి (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసిజర్స్‌)కు అనుగుణంగా పాఠశాల సంస్థాగత ప్రణాళిక( ఇన్‌స్టిట్యూషన్‌ ప్లాన్‌) తయారుచేసుకొని ఈనెల 18వ తేదీ ఆయా మండలాల విద్యాధికారులు ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావాలన్నారు. సమావేశంలో తమ ప్రణాళికను వివరించాలన్నారు. పాఠశాలల్లో తరగతులు ప్రారంభం అయిన తర్వాత కరోనా మహామ్మా రిని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు  తీసు కోవాలని సూచించారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవ సరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆయన కోరారు. పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపధ్యంలో పారిశుధ్య చర్యలకు, శానిటేషన్‌ తదితర అంశాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. కొవిడ్‌పై అందరూ అప్రమత్తంగా ఉండాలని, తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని డీఈవో కోరారు. ఈ సమావే శంలో  డీసీఈబీ సెక్రటరీ మాధవరావు, ఏసీజీఈ రామేశ్వ రరావు, కిరణ్‌ కుమార్‌  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-18T04:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising