ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిబంధనలతో ఎస్సీ వసతి గృహాలు

ABN, First Publish Date - 2021-01-24T04:40:00+05:30

కరోనా మహామ్మారి ప్రభావంతో ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లో విద్యాబ్యాసం చేసే విద్యార్థులు ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు.

బల్లలను శానిటేషన్‌ చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 50 హాస్టల్స్‌లో 2,912 మంది విద్యార్థులు

1 నుంచి వసతి గృహాల ప్రారంభం

భౌతిక దూరంతో ఏర్పాట్లు: డీడీ కస్తాల

ఖమ్మంసంక్షేమవిభాగం, జనవరి 23: కరోనా మహామ్మారి ప్రభావంతో ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లో విద్యాబ్యాసం చేసే విద్యార్థులు ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు.  చదువుకు, సంపూర్ణ ఆహారానికి దూరమయ్యారు. ఎస్సీ వసతిగృహాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతో జిల్లా సాంఘీక సంక్షేమశాఖ అధికారులు ఎస్సీ హాస్టల్స్‌ దుమ్ము దులిపే పనిలో పడ్డారు. కొవిడ్‌ నిబంధనలతో ఫిబ్రవరి 1నుంచి ఎస్సీ వసతిగృహాలు ప్రారంభించేందుకు కార్యచరణ ప్రారంభించారు.

తల్లిదండ్రుల అంగీకారపత్రంతోనే...

జిల్లాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న 50 సాంఘీక సంక్షేమవసతిగృహాల్లో గత సంవత్సరం వరకు విద్యాబ్యాసం చేసిన వారిని ఈ ఏడాది , పై తరగతులకు పంపనున్నారు. ఈ మేరకు వసతి గృహాల్లో కొనసాగించేందుకు కార్యచరణ చేస్తున్నా రు. కరోనా వైరస్‌కు తమ పిల్లలు గురైన అంగీకరిస్తామని పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.

భౌతిక దూరంతో వసతిగృహాల ఏర్పాటు

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేం దుకు ఏర్పాట్లు ప్రారంభించారు. విద్యార్థుల పడక లకు కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. చదివే ప్రాంతంలో ఆరు అడుగుల దూరం పాటిస్తూ ఒక్కో విద్యార్థికి ఒక్కో నెంబర్‌ను కేటాయించి భౌతిక దూరంతో ఏర్పాట్లు చేశారు. స్నానాల గదులు, మరుగుదోడ్లు, పడకలు, దుప్పట్లు శానిటైజర్లతో శుభ్రం చేస్తున్నారు.

కొవిడ్‌ నిభందనలతో 

 కస్తాల సత్యనారాయణ, 

డీడీ, సాంఘీకసంక్షేమశాఖ

రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 నుంచి ఖమ్మం జిల్లాలోని 50 ఎస్సీ హాస్టల్స్‌ను ప్రారంబించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంబించాం. ప్రతి విద్యార్ధి పట్ల కరోనా జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతోంది. విద్యార్థుల తల్లి,దండ్రులు అంగీకారం పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. భౌతికదూరంతో పడకలు ఏర్పాటు చేశాం.  

Updated Date - 2021-01-24T04:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising