ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీల్లో పర్యావరణాన్ని కాపాడండి: ఎమ్మెల్యే రాములునాయక్‌

ABN, First Publish Date - 2021-04-13T05:47:54+05:30

ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాంతో గ్రామపంచాయతీల్లో పర్యావరణాన్ని కాపాడాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా, ఏప్రిల్‌ 12: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాంతో గ్రామపంచాయతీల్లో పర్యావరణాన్ని కాపాడాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ సూచించారు. మండలంలోని గొల్లపూడి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ పసుపులేటి వినోద ఆధ్వర్యంలో సోమవారం తడి,పొడి చెత్తబుట్టలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఉత్తమ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచ్‌లపై ఉందన్నారు. పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టుమిషన్‌లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, సర్పంచ్‌ పసుపులేటి వినోద, వైస్‌ఎంపీపీ బాణాల వెంకటనర్సమ్మ, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, వైరా మునిసిపల్‌ వైస్‌సచైర్మన్‌ ముళ్లపాటి సీతరాములు, వైరా సొసైటీ డైరెక్టర్‌ తాతా బసవయ్య, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్‌రావు, మాజీ సర్పంచ్‌ బాణాల వెంకటేశ్వర్లు, అష్ణగుర్తి సర్పంచ్‌ ఇటుకల మురళీ, పులిగొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ చైర్మన్‌ శాఖమూడి లోకేశ్వరరావు, పోలిమెట్ల మాధవరావు పాల్గొన్నారు.


కారేపల్లిలో బాధితులకు పరామర్శ


కారేపల్లి: మండల కేంద్రంలో సోమవారం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ సుడిగాలి పర్యటన చేశారు.మండల కేంద్రంలో మృతిచెందిన రాంప్యారీధరక్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ యూత్‌ నాయకులు మజీద్‌ పాషా మాతృమూర్తి అప్సర్‌ సుల్తానా బౌతికాయాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం రెండు రోజుల క్రితం కిందజారిపడి గాయపడిన సోసైటి డైరక్టర్‌ అడ్డగోడ అయిలయ్యను పరామర్శించారు. ఆయన వెంట టీఆర్‌ఎఎస్‌ మండల పార్టీ అధ్యక్షకార్యదర్శులు తోటకూరి పిచ్చయ్య, అజ్మీర వీరన్న, వైస్‌ ఎంపీపీ రావూరి శ్రీనివా్‌సరావు, ఎండోమెంట్‌ ఛైర్మన్‌ మల్లెల నాగేశ్వరరావు తదితరులుఉ పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T05:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising